వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ తాడేపల్లి కార్యాలయంలో సీఎం జగన్‌తో ఆయన భేటీ కానున్నారు. మంగళగిరి టికెట్ నిరాకరించడంతో వైసీపీకి, ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేశారు ఆర్కే. ఇటీవలె షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి ఆయన మళ్లీ సొంత గూటికి చేరుకుంటారని సమాచారం.