విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం మొదలైంది. 2024 ఎన్నికలకి బరిలోకి దిగేందుకు నేత లు సిద్ధం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై గెలిచిన వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుకి ఈ సారి సీట్ ఇస్తే గెలవటం చాలా కష్టం అంటున్నారు నియోజక వర్గ ప్రజలు. అధికార పార్టీ మాత్రం విజయవాడని వదిలేది లేదని గెలుపు దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే వైసీపీ అధిష్టానం సెంట్రల్ సీట్ కాపు నేతకి ఇస్తే మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉండచ్చని అంచనా వేస్తున్నారు.
గతంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి విజయవాడలో ఒక కార్యక్రమానికి హాజరు అయినప్పుడు విజయవాడ మూడు సీట్ల అభ్యర్డులు ఇప్పుడున్న వారేనని ప్రకటించారు. అయితే ప్రజలు మాత్రం వైసీపీకి మొగ్గు చూపట్లేదని అధిష్టానానికి వచ్చిన సర్వే రిపోర్ట్‌లో తెలపటంతోపాటు, అధిష్టానం అభ్యర్థుల నియోజకవర్గాలు మార్పు పెద్ద చర్చనీయంసంగా మారింది. అయితే మల్లాది విష్ణుకి ఎందుకింత వ్యతిరేకత ఉందని అనుకుంటే, గతంలో విష్ణు కు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల ముందు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియచేసారు. గతంలో కూడా మల్లాది విష్ణుకి చెందిన బార్ లో తాగి కళ్ళు పోగొట్టుకున్నసంఘటనలు ఉన్నాయి. దీంతో కల్తీ మద్యం యదేశ్చగా విష్ణుకి చెందిన బార్ల లో అమ్మకాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టడం జరిగింది. మల్లాది విష్ణుకి ఈసారి సీట్ ఇస్తే మాత్రం పెద్ద మెజారిటితోనే ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటు సమాచారం అందుతోంది.
విష్ణుకి ఈసారి సీట్ ఉండదని అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్నాయని, అందుకోసమే విష్ణు తన అనుచరులతో భవాని ఐలాండ్ లో సమావేశం నిర్వహించారని, నియోజకవర్గంలో హాట్ టాపిక్ మొదలైంది. ప్రస్తుతం సెంట్రల్ సీట్ కోసం కొందరు నాయకులు వైసీపీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ సీట్ వంగవీటి రంగా కుమారుడు రాధాకి ఇస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అందుకే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, రాధాతో దగ్గరగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వంగవీటి రంగా వర్ధంతి రోజున రాధాతో పాటు కొడాలి నాని కూడా కాశీకి వెళ్ళటం మరి కొంత చర్చలను బలంగా విని పించేందుకు అవకాశం దొరికిందని అందరు అనుకుంటున్నారు. వైసీపీలోకి రాధా వస్తే మాత్రం సొంత గూటికి చేరు కున్నారని ప్రచారం మొదలెట్టబోతున్నట్లు ఊహగానాలు మొదలయ్యాయి. వంగవీటి రాధాకి వైసీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవకాశం ఇస్తే మాత్రం టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై గెలవచ్చని అధిష్టానం భావిస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువుగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఓటర్లు ఉన్నారని, అందులోను రంగా అభిమానులు ఎక్కువుగా ఉన్నారని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
కానీ రాధా మాత్రం వైసీపీలోకి వస్తున్నారని ఎవరితోనూ చర్చించలేదు. టీడీపీలోనే ఉంటే మాత్రం విజయవాడ ఏ నియో జకవర్గం నుంచి బరిలోకి దించుతుంద్దో క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ టీడీపీ నుంచి సెంట్రల్ నియోజకవర్గం నుంచే బరి లోకి దించితే మాత్రం గెలుపు సులభతరం అవుతుందని బోండా ఉమాకి టీడీపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పద వీతో సరిపెట్టవచ్చని ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందో వేచి చూడాల్సిందే.