కృష్ణాజిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ 2024 ఎన్నికల బరిలో గెలిచేందుకు అభ్య ర్థుల కసరత్తు చేస్తూ సిట్టింగ్ అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే 68 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో సిట్టింగ్ అభ్యర్థులను, పార్టీ పెద్దలు బుజ్జగిస్తున్నప్పటికీ ఫలితం కని పించట్లేదు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు అనేక మంది నేతలు పక్క పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో సైతం ఈసారి వైసీపీ అధిష్టానం భారీ మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తుంది.
కృష్ణా జిల్లాకి కేంద్ర బిందువుగా అయిన మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఈసారి ఎవరికీ అడ్డాగా మారబోతుందనేది ఉత్కంఠత నెలకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వల్లభనేని బాలశౌరి గెలు పొందారు. అయితే ఈసారి వైసీపీలో పార్లమెంట్ టికెట్ లేకపోవటంతో జనసేన కండువ కప్పుకున్నారు. జనసేన పార్టీలో ఒక బలమైన నాయకుడు రావటం తో, మచిలీపట్నం పార్లమెంట్ స్థానం వల్లభనేని బాలశౌరి అడ్డా అవుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ బాలశౌరికి అవకాశం వస్తుందని, అలాగే ఈసారి ఆయన తనయుడిని సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తనయుడికి అవనిగడ్డ నియోజక వర్గం నుంచి అవకాశం ఇస్తే, గెలిపించుకునే బాధ్యత తీసుకోటంతో పాటు, పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ
నియోజకవర్గ స్థానాలు గెలిపించే బాధ్యత తీసుకుంటానని అన్నట్లు విశ్వశనియ వర్గాల నుంచి సమాచారం.
మచిలీపట్నంలో 2019 నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ నిధుల వల్లే జరిగిందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా గతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని వర్గం, వల్లభనేని వర్గం విభేదాలు ఉండటంతో ఈసారి మచిలీపట్నం అసెంబ్లీ స్థానం గెలుపు కోసం బాలశౌరి కృషి చేస్తారని చర్చలు జరుగుతున్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రోటో కాల్ సైతం పట్టించుకోవట్లేదని గతంలో ఎంపీ అసంతృప్తి చెందారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని ఆయన సన్నిహితులు అనుకుంటున్నారు. బాల శౌరికి ప్రాధాన్యత సరిగా ఇవ్వక పోవటమే కాకుండా ఆయన అనుచరులపై సైతం గతంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయటం కూడా ఒకింత అసంతృప్తి వెల్లడవుతుందని కృష్ణా జిల్లాలో బలంగా వినిపిస్తున్న వాదనలు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొనకోళ్ల నారాయణ ఓటమి చెందటంతో ఈసారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా 2024 ఎన్నికల్లో మచిలీపట్నం ఎవరికీ అడ్డాగా మారబోతుందో పెద్ద చర్చనీయంసంగా మారింది.


