29.1 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

మకర సంక్రాంతి నుండి శివరాత్రి వరకు ప్రయాగ మాఘ మేళ

           త్రివేణి సంగమం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రయాగ . గంగ,యమున , సరస్వతి నదులు అక్కడ సంగమించి భక్తుల పాపాలను కడిగి పునీతుల్ని చేస్తున్నాయి. మకర సంక్రమణం రోజునే అలహాబాద్ ప్రయాగలో మాఘమేళ ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి రోజు ఆరంభమయ్యే మాఘమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ఈ మేళాలో సాధు సంతుల విన్యాసాలు ,త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా ఇనుమడింప చేస్తాయి.

          ప్రయాగ త్రివేణి సంగమంలో ప్రతి ఏటా మకరసంక్రమణం నుంచి శివరాత్రి వరకు మాఘమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంలో భక్తులు పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుండి లక్షలాదిమంది యాత్రికులు తరలివస్తారు.కుంభ మేళా తరహాలో ప్రయాగలో జరిగే పవిత్ర స్నానం మాఘమేళా పుణ్య స్నానం. త్రివేణి సంగమంలో ఉత్తరాయణం కాలంలో జరిగే ఈ మేళా మకర సంక్రమణం రోజు ప్రారంభమై శివరాత్రి వరకు కొనసాగడానికి శాస్త్రీయ దృక్పథం ఉందని పండితులు చెప్తారు.

         మన దేశంలో పుణ్యతీర్ధాలు భక్తి ప్రపత్తులకు నిలయంగా భాసిల్లుతున్నాయి. మానవుడిలో భక్తిని తద్వారా ఓ క్రమబద్ధమైన జీవనగమనాన్ని ఏర్పరచడంలో తీర్ధాలు ప్రత్యేక పాత్ర వహిస్తున్నాయని చెప్పడంలోఎలాంటి సందేహం లేదు. కాలం ఎంతగా నవీనంగా మారుతున్నా మానవునిలో భక్తిభావం, దైవం పట్ల విశ్వాసం నిలిచే ఉంటాయనడానికి అపూర్వమైన పుణ్యతీర్ధాలే నిదర్శనంగా నిలుస్తాయి. ఆ పుణ్య తీర్ధాలలో ప్రముఖమైనది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ. త్రివేణి సంగమంగా… పవిత్రతకు నిలయంగా ప్రయాగ అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరం ఉంది.

పవిత్ర త్రివేణీ సంగమంగా పేర్కొనే అలహాబాద్ నగరాన్నే ప్రయాగగా వ్యవహరిస్తారు . 12ఏళ్లకోసారి నిర్వహించే మహా కుంభమేళ మహోత్సవాలు ఈ ప్రయాగగా పుణ్యక్షేత్రానికి మరింత శోభను సంతరించిపె డతాయి. దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ సంగమిస్తాయని వీటితోపాటు సరస్వతీ నది కూడా ఇక్కడ అంతర్లీనంగా వచ్చి కలుస్తుందని చరిత్ర చెబుతోంది. అందుకు నిదర్శనంగానే ఇక్కడ నీళ్లు మూడు రంగుల్లో కనిపిస్తాయి. అందుకే పవిత్ర నదులైన ఈ మూడు నదులు కలవడం ద్వారా దీన్ని త్రివేణి సంగమంగా భక్తులు వ్యవహరిస్తుంటారు. ఇంతటి మహత్మ్యం ఉండడం వల్లే ఈ పవిత్ర త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపాలుహరించడంతోపాటు మానవులకు ఇహ, పరలోక సౌఖ్యాలు అందివస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఈ నేపథ్యంలోనే యుగయుగాలుగా పవిత్ర నదీ స్నాన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

        ప్రయాగ త్రివేణి సంగమంలో ప్రతి ఏటా మకర సంక్రమణం నుంచి శివరాత్రి వరకు మాఘమేళాని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో భక్తులు పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుండి కోట్లాదిమంది తరలివస్తారు. కుంభ మేళా తర్వాత ప్రయాగలో అదే స్థాయిలో జరిగే పవిత్ర స్నానం మాఘమేళా పుణ్య స్నానం. త్రివేణి సంగమంలో ఉత్తరాయణం కాలంలో జరిగే ఈ మేళా మకర సంక్రమణం రోజు ప్రారంభమవుతుంది.ప్రయాగ త్రివేణి సంగమంలో ప్రతి ఏటా మకరసంక్రమణం నుంచి శివరాత్రి వరకు మాఘమేళాని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో భక్తులు పుణ్య స్నానాల కోసం దేశ విదేశాల నుండి అశేషంగా తరలివస్తారు.

       దేశవ్యాప్తంగా ఉన్న తీర్థాల్లో ప్రయాగకు ఉన్న ప్రత్యేకత మరే తీర్థానికి లేదనే చెప్పాలి. ఏడాది పొడవునా ఏదో ఒక తీర్థానికి యాత్రికులు వస్తూనే ఉంటారు. ప్రతి రోజూ ప్రయాగ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. కుంభ మేళా తర్వాత ప్రయాగలో అదే స్థాయిలో జరిగే పవిత్ర స్నానం మాఘమేళా పుణ్య స్నానం . త్రివేణి సంగమంలో ఉత్తరాయణ పుణ్య కాలంలో జరిగే ఈ మేళా మకర సంక్రమణం రోజు ప్రారంభమవుతుంది. పౌష్య పూర్ణిమ, మకర సంక్రాంతి , మౌనీ అమావాస్య , వసంతపంచమి ,మాఘపూర్ణిమ , మహాశివరాత్రి రోజుల్లో త్రివేణి సంగమ స్నానం అత్యంత పుణ్యఫల దాయకమని భక్తులు విశ్వసిస్తారు..

       మాఘమేళా పుణ్యస్నాలు ఈ మకర సంక్రాంతి రోజున ప్రారంభమై శివరాత్రి రోజుతో పూర్తవుతాయి. పుణ్యతీర్ధాలలో ప్రయాగ తీర్ధరాజంగా ప్రసిద్ది చెందింది. ఈ త్రివేణి సంగమంలో గంగా , యమునా, సరస్వతీ జలాలు సమ్మిళితమయ్యే దృశ్యం భక్తులకు చూడ ముచ్చటగా దృశ్యమానమవుతుంది. పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి. సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ‘ఉత్తరాయణ పుణ్య కాలం’గా పరిగణించిన సనాతన సిద్ధాంతం అద్వితీయం… ఆచరణీయం…జన్మలు ధన్యణీయం….

    ఖగోళ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో సంక్రాంతి పండుగ వైభవోపేతంగా జరుపుకుంటారు. అయితే ఏ దేశంలోనైనా ఆ దేశ విజ్ఞాన, సాంస్కృతిక, వికాసాలను అనుసరించి జీవన సంస్కృతులు ఆధారపడి ఉంటా యి. భారత దేశంలో సనాతనమైన ఆర్షధర్మం వేద ప్రామాణికంగా నిర్వహిస్తారు. కాబట్టి మన ప్రతీ ఆచారంలోనూ ఒక శాస్త్రీయ నిబద్దత ఉంటుందని వేదపండితులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే మన తీర్థాలు… పూజాలు … క్రతువులు …హోమాలు …. ఆధారపడి ఉంటాయి.

       మాఘమేళా పుణ్యస్నాలు ఈ మకర సంక్రాంతి రోజున ప్రారంభమై శివరాత్రి రోజుతో పూర్తవుతాయి. పుణ్యతీర్ధాలలో ప్రయాగ తీర్ధరాజంగా ప్రసిద్ది చెందింది. ఈ త్రివేణి సంగమంలో గంగా జలం, యమునా జలం సమ్మిళితమయ్యే దృశ్యం భక్తులకు చూడ ముచ్చటగా దృశ్యమానమవుతుంది. పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయి. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ‘ఉత్తరాయణ పుణ్య కాలం’గా పరిగణించిన సనాతన సిద్ధాంతం లో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం ఎప్పుడూ మంచిదే. కాని కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ సంక్రాంతి పర్వానికి ప్రాముఖ్యమున్నా, ఆచరించే పద్ధతుల్లో భిన్నత్వం తప్పనిసరిగా కనిపిస్తోంది.

    ‘తిల సంక్రాంతి’గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, పదార్థాల్లో ప్రసాదాల్లో విని యోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని, మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసు కొనే సంప్రదాయం ఉంది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలతోపాటు మకర సంక్రాంతి ఘడియల నుండి శివరాత్రి ఉత్సవా ల వరకు పితృతర్పణలను నిర్వహిస్తారు. అందుకే దేశ విదేశాల నుండి భారతీయులు మాఘమేళాకు యాత్రికులు విశేషంగా తరలివస్తారు .హరిద్వార్, ఉత్తరకాశీ ప్రాంతాల్లో కూడా మాఘమేళ సందర్భంగా భక్తులు గంగా స్నానాలు చేసి పాపాలను పరిహరించికుంటారు…ఉత్తరకాశీలో ఏడు రోజులపాటు ఘనంగా మాఘమేళాని నిర్వహిస్తారు. ఈ సందర్భం గా డోలీ ఉత్సవాలు సైతం వైభవంగా జరుపుతారు. మాఘమేళాలో చేసే పవిత్ర స్నానం, దానం, పితృతర్పణం, జపతపా లు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి.

దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యం వుంది. ఈ పుణ్యదినాన తోటి మనుషులతో జీవజాతులతో పంచుకున్నవి, ఇచ్చినవి మాత్రమే అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తి పై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా మంచి వృష్టిని, ఆరోగ్యాన్ని, సస్య సంపదలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మంకర సంక్రాంతి రోజున శివుడికి ఆవునేతితో అభిషేకం, నువ్వుల నూనె దీపం, బియ్యం కలిపిన తిలలతో పూజ, తిలలతో కూడిన పదార్థాల నివేదన అనేవి పుణ్య విధులుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. పుణ్యస్నానాలకు మకర మాసం అంటే చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం ప్రముఖమైంది. కాబట్టి ఈ మకర సంక్రమణం రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావి స్తారు. అందుకే గంగా-యమునా-సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం. ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం.

     నదీస్నానం కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో, స్నాన మంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రదా నానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి. ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనగా పేర్కొ న్నారు. సూర్యుణ్ని నారాయణుడిగా, శోభను, శక్తిని పోషించే మహిమను లక్ష్మిగా భావిస్తారు. సంక్రాంతి నాటి సూర్య శోభేకాక, పంటల శోభ, సంపదల పుష్టి చేకూరండంతో అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావనకు నిండుదనం వస్తుంది, శాస్త్రీయమైన సత్కర్మలు, సంప్రదాయసిద్ధమైన కళలు, ఉత్సవాలు మానవాళికి ఉత్సాహవంతమైన కళాత్మకతను తీసుకువస్తాయి. ఈ చైతన్యం ఏడాది పొడవునా ఉండేందుకు కొన్ని ప్రాంతా సూర్యోపాసన దీక్షలు కూడా చేపడతారు. ఇంటింటా బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు- వెరసి సంక్రాంతులు వైభవంగా ప్రకటితమవుతాయి.

త్రివేణి సంగమ పుణ్యతీర్ధం భక్తుల పాపాలన్నీ కడిగేసి నిష్కళంకులుగా తరింపచేస్తుంది. సుజల పూర్ణమైన సప్త నదులు అనగా గంగా, యమున, సరస్వతీ, గోదావరి, కావేరి, నర్మదా, సింధు నదులు భారత పుణ్యభూమి మీదగా ప్రవహిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను అనుసంధానంగా ప్రవహిస్తాయి. వీటితోపాటు బ్రహ్మపుత్ర, సరయూ, పల్గునీ, గోమతి, భీమ, తుంగభద్ర, పెన్న, మహానది, ఇంద్రావతి, తపతి, సబర్మతీ తదితర నదుల ప్రవాహంతో భూమాత సస్యశ్యామ లంగా పునీతమవుతుంది. పవిత్ర నదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా పుణ్యదాయకమైన నాసిక్‌, ఉజ్జయిని, హరిద్వార్‌ , అలహాబాద్‌ క్షేత్రలలో కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇవి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క ప్రదేశంలో వైభవంగా జరుగుతాయి. బృహస్పతి వృషభరాశిలో వుండగా, సూర్యుడు మకర సంక్రమణమైనపుడు మాఘమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇలాంటి కుంభ పర్వకాలంలో లక్షలాది యాత్రికులు అలహాబాద్‌ త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు చేసి, పూజాది కార్యక్రమాలు, పిండ ప్రదానాలు నిర్వహిస్తారు .

       ప్రయాగక్షేత్రం త్రివేణి సంగమంతోపాటు అష్టాదశ శక్తి పీఠాలలో పద్నాలుగోది శ్రీ మాధవేశ్వరి శక్తి పీఠం. సతీదేవి హస్తాంగుళీయకం పడిన ప్రదేశంగా ప్రసిద్ధి. శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం త్రివేణి సంగమం వద్ద వుండేది అని పురాణాలు చాటుతున్నాయి. ప్రయాగ క్షేత్రంలో శ్రీమాధవేశ్వరి అనే నామంతో శక్తిపీఠం లేదు. క్షేత్రంలోని అలోపిదేవినే శ్రీమాధవేశ్వరి దేవిగా భక్తులు కొలుస్తారు. శ్రీఅలోపిదేవి విగ్రహరహితమై, గుప్తంగా మందిరంలో దర్శనమిస్తుంది. అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సుమారు మూడు కి.మీ. దూరంలోగల ‘దారాగంజి’ అనే ప్రాంతంలో అలోపిబాగ్‌లో అమ్మదర్శనం చేసి తరించుకోవచ్చు. ఇది అలోపిశంకరి శక్తిపీఠంగాను, మహేశ్వరి పీఠంగాను ప్రసిద్ధి చెందింది. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి మందిరం వుంది. పీఠానికి మధ్య ఒక రంధ్రం దర్శనమిస్తుంది. దీనిపై అమ్మవారి ఊయల వ్రేలాడుతూ వుంటుంది. భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పండాలు రంధ్రంలో అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు అమ్మవారి ఊయలను భక్తి శ్రద్ధలతో ఊపుతారు. మందిరం వెనుక భాగాన నవ దుర్గలు, గణపతి, శివలింగ మూర్తులు దర్శనమిస్తాయి.

       త్రివేణి సంగమం నుంచి కూడా అలోపిబాగ్‌ చేరవచ్చు. అలోపిబాగ్‌ నుంచి సుమారు నాలుగు కి.మీ. దూరంలో శ్రీ కళ్యాణి దేవి అర్థశక్తిపీఠం ఉంది. మందిరంలోని కళ్యాణిదేవికి కుడివైపున పార్వతీదేవి, ఎడమ వైపున మహాకాళి దేవిని దర్శించవచ్చు. ఇది అర్ధశక్తి పీఠంగా ఖ్యాతిగాంచింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీరాధాకృష్ణులు, శ్రీరామలక్ష్మణుల సమేత జానకీమూర్తులను సందర్శించుకోవచ్చు. కళ్యాణిదేవి మందిరానికి సుమారు ఆరు కి.మీ. దూరాన మీర్‌పూర్‌ గ్రామంలో శ్రీలలితాదేవి సిద్ధిపీఠం ఉంది. ఆలయ ప్రవేశ ముఖద్వారం పశ్చిమ ముఖంగాను, శ్రీలలి తాదేవి తూర్పుముఖంగాను కొలువై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ లలితా అమ్మవారికి ఇరువైపుల శ్రీమహాలక్ష్మి, శ్రీమహా సరస్వతి మూర్తులున్నారు. ఆలయ పూజారి శ్రీలలితాదేవిని, ప్రయాగ మాధవేశ్వరిగా వర్ణిస్తారు. ప్ర అంటే గొప్ప. యాగ అంటే యాగం. ఇది గొప్ప యాగం చేసిన ప్రదేశమైంది కాబట్టే ఈ ప్రాంతానికి ‘ప్రయాగ’ అనే పేరు వచ్చిందం టారు. ప్రయాగలో అక్బరు నిర్మించిన కోటలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది. దాన్ని ‘అక్షయ వటం’ అని పిలుస్తారు. ఈ వటవృక్షం శ్రీహరికి గొడుగుగా ఉంటుందని పురాణ సారం.

ఈ మకర సంక్రమణం రోజు అందరికీ అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేయడం సాధ్యంకాదు. అందుకు ప్రత్యా మ్నాయంగా మన ఇంటిలో స్నానం చేస్తూనే, అన్ని పవిత్ర నదులను ఆ నీటిలోకి ఆవాహన చేసి స్నానం చేయడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చదవుకుని స్నానం చేస్తే ఆ పుణ్య నదుల స్నాన ఫలం లభిస్తుందని చెబుతారు. ఆ పుణ్యనదుల పేర్లు తలచుకుని స్నానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు. ‘గంగ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు’. ఈ శ్లోకంలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదుల పేర్లు కలిసి ఉన్నాయి. మన సంస్కృతి సర్వేజనాసుఖినో భవంతు అంటూ సర్వమానవాళిని సుఖంగా జీవించమని దీవిస్తుంది. సాధ్యాసాధ్యాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన మన పూర్వీకులు సాధ్యం కానివారికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపించింది. ఇదే మన భారతీయ సనాతన ధర్మంలోని వైశిష్ట్యం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్