హైదరాబాద్ : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశారంటూ బేగంపేట్ బస్తీ వాసులు ఆరోపించారు.అంతేకాదు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు ప్రజాభవన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై మంగళవారం ప్రజావాణిలో మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శి స్తూ ర్యాలీగా ప్రజాభవన్ కు చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ భూమిని తాము కష్టపడి కొనుక్కున్నామన్నారు. ఇప్పుడు ఆ భూమి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనఅనుచరులు బెదిరిస్తున్నారని చెప్పారు.
తమ భూమిలోనే కష్టపడి ఇళ్లు కట్టుకున్నామని, వాటిని కూలగొట్టిస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు కన్నీటిపర్యం తమయ్యారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుల ఆగడాలను తట్టుకోలేకపోతున్నామని, వాళ్ల నుండి తమని నుంచి కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాగా, మంగళవారం ప్రజావాణి సందర్భంగా బేగంపేట్ లోని ప్రజాభ వన్ కు జనం పోటెత్తారు. నగరం నలుమూలల నుండి, జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజాభవన్ వచ్చారు.