ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఆళ్లగడ్డలో రా కదలి రా బహిరంగ సభలో చంద్ర బాబు పాల్గొన్నారు. అయితే, ఆళ్లగడ్డ సభకు టీడీపీ సీనియర్ నేత ఏ. వి. సుబ్బారెడ్డి రాకూడదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వర్గం అంటోంది. ఏవి వస్తే వేదికపైకి పిలిచేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. చంద్రబాబు సభ సాక్షిగా టీడీపీలో విభేదాలు బయటపడనుండడంతో ముందుగానే అలర్ట్ అయ్యింది అధిష్టానం. ఏవి సుబ్బారెడ్డి తో మాట్లాడి ఆయనకు నచ్చచెప్పింది. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డిని మాజీ మంత్రి ఫరూక్ కార్యాలయంలో ఆయన సమక్షంలో చంద్రబాబు సభ పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి చర్చలు జరిపారు. అళ్ళగడ్డలోని పరిస్థితులను ఏవికి చౌదరి వివరించారు.చంద్రబాబు సభ విజయవంతం కావాలని చెప్పారు. పార్టీ కోసం సభకు రానని చెప్పిన ఏవి సుబ్బారెడ్డి, సభను విజవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.