అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 505 పాయింట్లు పుంజుకొని 71వేల 929 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 141 పాయిం ట్లు పెరిగి 21వేల 712 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.11 వద్ద ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు గతవారాన్ని లాభాలతో ముగించాయి. నేడు ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడ వుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.17 శాతం తగ్గి 79.92 డాల ర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపరులు శనివారం 545.58 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు సైతం 719 కోట్ల విలువ చేసే వాటాలను అమ్మేశారు. రిపబ్లిక్‌డే సందర్భంగా మార్కెట్లు శుక్ర వారం పనిచేయవు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కారణంగా సోమవారం మార్కెట్లు పనిచేయనందున ఈ వారం ట్రేడింగ్ 3 రోజులకే పరిమితమవుతోంది.


