చౌధురి చరణ్ సింగ్ అనగానే ఎవరికైనా భారత రైతాంగం గుర్తుకు వస్తుంది. చరణ్ సింగ్ ప్రధాని పదవిలో ఉన్నా అన్నదాతల గురించే ఆలోచించారు. వారి కష్టనష్టాల గురించే పట్టించుకున్నారు. అవసరమైతే పదవులు వదులుకు న్నారు. రైతాంగం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపారు. రైతుల సంక్షేమం కోసమే జీవితాంతం తపించారు.
చౌధురి చరణ్ సింగ్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు. దేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న నేత ఆయన. మహాత్మా గాంధీ సూచించిన అహింసాయుత మార్గంలో బ్రిటిష్ వారిపై ఆయన సమరభేరి మోగించారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఆయన అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు గాను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను 12 సంవత్సరాలపాటు జైలుకు పంపింది. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో 1940 నవంబర్‌లో మళ్లీ మరో సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. 1942 ఆగస్టులో మరో కేసుకు సంబంధించి మళ్లీ జైలుకెళ్లారు.
చరణ్ సింగ్ 1903 డిసెంబర్ 23న ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామీణ రైతు కుటుంబంలో జన్మించారు. భారత స్వాతం త్ర్య ఉద్యమంలో భాగంగా చరణ్ సింగ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చరణ్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగారు. 1952 నాటికి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అగ్ర నేతల్లో ఒకరిగా మారారు. గోవింద్ వల్లభ్ పంత్ క్యాబినెట్‌లో భూసంస్కరణలకు బాధ్యత వహించే రెవెన్యూ మంత్రిగా చరణ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. రైతాంగ ప్రయోజనాల విషయంలో చరణ్ సింగ్ ఏ రోజూ రాజీపడలేదు. ఏ పదవిలో ఉన్నా ప్రతిక్షణం అన్నదాతల సంక్షేమం కోసమే ఆయన కృషి చేశారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో కాంగ్రెస్ నిజాయితీతో వ్యవహరించడం లేదని ఒక దశలో చరణ్ సింగ్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో1967 ఏప్రిల్ ఒకటోతేదీన కాంగ్రెస్ కు గుడ్‌బై కొట్టారు చరణ్ సింగ్. ప్రతిపక్ష కండువా కప్పుకున్నారు. 1967లో ఉత్తరప్రదేశ్‌కు మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ రికార్డు సృష్టిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో కేవలం 24 వారాలకే ముఖ్యమంత్రి పదవికి చరణ్ సింగ్ రాజీనామా చేశారు.
1977నాటి జనతా పార్టీ ప్రయోగం విఫలమైంది. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ కూలిపోయింది. ఆ తరువాత జరిగిన అనేకానేక పరిణామాల్లో భాగంగా జనతా పార్టీ చీలికలు పేలికలైంది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలను అజెండా చేసుకుంటూ లోక్‌దళ్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు చరణ్ సింగ్. జనతా పార్టీలో ఆ తరువాత అనేక పరిణామాలు సంభవించాయి. రైతు నాయకుడు చరణ్ సింగ్‌కు ప్రధాని పదవి చేపట్టే అవకాశం లభించింది. 1979 జులై 28న దేశ ప్రధాని గా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే చరణ్ సింగ్ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగలేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో చరణ్ సింగ్ సర్కార్ కూలిపోయింది. 1980 జనవరి 14న ప్రధాని పదవికి చరణ్ సింగ్ రాజీనామా చేశారు. చౌధురి చరణ్ సింగ్ అనగానే ఎవరికైనా భారత రైతాంగం గుర్తుకు వస్తుంది. చరణ్ సింగ్ ప్రధాని పదవిలో ఉన్నా అన్నదాతల గురించే ఆలోచించారు. వారి కష్టనష్టాల గురించే పట్టించుకున్నారు. అవసరమైతే పదవులు వదులుకున్నారు. రైతాంగం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపారు. రైతుల సంక్షేమం కోసమే జీవితాంతం తపించారు. భారతీయ రైతుల ఛాంపియన్ గా చాంపియన్‌గా చరణ్ సింగ్ విశిష్ఠ గౌరవం పొందారు.