31.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

బీసీ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్

      తెలంగాణలో బీసీ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందా…? బీసీలను బీఆర్ఎస్ వైపుకు తిప్పే బాధ్యతలను కవితకు అప్పగించారా…? అసెంబ్లీలో పూలే విగ్రహం డిమాండ్ అందులో భాగమేనా…? అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు తమకు అండగా నిలిచారని బీఆర్ఎస్ భావిస్తోందా…? బీసీల ఓటు బ్యాంకును పదిలం చేసుకునే వ్యూహరచన బీఆర్ఎస్ చేస్తోందా…?

      తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బీసీల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ఆయా సామాజిక వర్గాలకు దగ్గర కావాలని ప్రయత్నం చేస్తు న్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరచూ బీసీల అంశాలపై స్పందిస్తున్నారు. తెలం గాణ అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అదే విధంగా పూలే పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీసీల సదస్సుకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఇటీవల హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

       ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయింది. ఈ సారి బీఆర్ఎస్ పార్టీకి దళితులు, గిరిజనులు ఓట్లు వేయలేదని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. దళితులకు దళిత బంధు లాంటి పథకాలు అమలు చేసినా అదే విధంగా గిరిజనులకు పోడు పట్టాలు, తండాలను గ్రామ పంచాయతీలు గా చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలు దూరం అయ్యాయని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎస్సి,ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ఎస్సీ ,ఎస్టీలు తమకు దూరం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 50 శాతానికి పైగా ఉన్న బీసీలు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. బీసీ సామాజిక వర్గాలు తమకు అండగా నిలవడం ద్వారానే 39 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనే చర్చ జరుగుతోంది. దీంతో బీసీ సామాజిక వర్గాలు తమకు దూరం కాకుండా ఉండేందుకు కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

      త్వరలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారా యి. గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో సిట్టింగ్ స్థానాలు నిలుపుకోవడం సవాల్ గా మారింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన బీసీల ఓటు బ్యాంకు ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల అంశాన్ని ఎత్తుకున్నారనే భావన నెలకొంది. పదే ళ్లు అధికారంలో ఉండి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఓట్ల కోసమే కవిత బీసీల జపం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు ఎవరికి మద్దతు ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్