తెలంగాణలో నేటి నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రను ప్రారంభించనుంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నారాయణపేటలో జరిగే విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రారంభిస్తారు. విజయ సంకల్పయాత్ర ఈరోజు నుంచి ప్రారంభమై మార్చి 2 తేదీ వరకు జరుగుతుంది. విజయసంకల్ప యాత్రలో 106 సమావేశాలు, 102 రోడ్ షోలను బిజెపి నిర్వహిస్తుంది. బాసర నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. సరస్వతీ దేవి ఆలయంలో పూజలు చేసి యాత్రను బీజేపీ నేతలు ప్రారంభిం చనున్నారు. భైంసాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం హేమంత బిస్వా శర్మ హాజరు కానున్నారు. ఆది లాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. సమ్మక్క సారలక్క జాతర ఉండటం వల్ల వరంగల్ జిల్లా పరిధిలో మూడు రోజులు ఆలస్యంగా విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవు తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 క్లస్టర్ లుగా 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 5 వేల 500 కిలోమీటర్లు విజయ సంకల్ప యాత్ర సాగుతోంది. విజయ సంకల్ప యాత్రలో బిజెపి పాలిత ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ముగింపు బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ బిజెపి ఆహ్వానించింది. విజయ సంకల్ప యాత్ర తోనే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది కమలదళం.


