భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానికి ఇవ్వను న్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అద్వానికి మోదీ అభినందనలు తెలిపారు. దేశ అభి వృద్ధిలో అద్వానీ కీలక పాత్ర పోషించారని చెప్పారు. అద్వానికి భారత రత్న లభించడం సంతోషకరమని చెప్పారు. ఎల్ కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్ 8న పాకిస్తాన్‌లోని కరాచీలో ఆయన జన్మించారు. కరాచీలోని సెయింట్‌పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించారు. పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో లా చదువుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. 1970 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహించారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయోధ్య రామాల యం కోసం రథ యాత్ర కూడా చేశారు. వాజ్‌పేయ్ ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం.. భార తరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 23న బీహార్మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తాజాగా అద్వానీని కూడా ఇవ్వనుంది. అద్వానీకి భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


