జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, బీఆర్‌ఎస్ నేత విజయ్ సింహపై బోరబండ పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదైంది. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ మహిళ నుండి రెండు లక్షలు తీసుకోని, శారీరకంగా వాడుకున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 376, 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. గతంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ నమోదైన ఓ రేప్ కేసులో విజయ సింహ నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.