నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నా యి. అమ్మవారి జన్మదినం సందర్భం 108 కలశాల జలాలతో అభిషేకం చేశారు. చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి మూలా నక్షత్రం సందర్భంగా వేకువ జామున గణపతి పూజ, అస్టో త్తర పూజ నిర్వహించారు. అనంతరం అక్షర శ్రీకార పూజలను వైదిక బృందం ప్రారంభించారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జామున 3 గంటల నుంచి చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. అభిషేక సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. అయితే విఐపి ప్రత్యేక లైన్ పేరుతో ఏర్పాటు చేసిన క్యూలైన్లలో సాధారణ భక్తులు చొరబడడంతో కాంప్లెక్స్ అంతా నిండిపోయింది. సాధారణ భక్తులు 2కిలోమీటర్ల మేర క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు.అధికారులు సరైన ఏర్పాట్లు కూడా చేయడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో కలసి 4గం టలు క్యూలైన్ లలో ఉంటే ఫీడింగ్ ఎలా చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పాలు, బిక్స్కెట్లు, నీటి పంపిణీ కూడా చేయడం లేదని భక్తులు మండిపడుతు న్నారు. అమ్మవారి జన్మదినం వసంత పంచమి సంవత్సరం లో ఒక్కరోజు కూడా సరైన ఏర్పాట్లు చేయలేకపోయరని ఆలయ అధికా రుల పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


