వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల లోటస్పాడ్లోని పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహిం చారు. పార్టీ విలీనం భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చిచనునన్నట్లు తెలుస్తోంది. షర్మిల ఈ నెల 4 వ తేదీ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీని కూడా విలీనం చేస్తున్నారని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి షర్మిల ఢిల్లీ వెళ్లనున్నన్నట్టు తెలుస్తోంది. షర్మిల భేటీ అనంతరం ఇడుపుల పాయకు ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి అశీస్సులు కోసం వెళ్లారు. నూతన వధూవరులు రాజారెడ్డి, ప్రియలతో షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు.తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.