పాకిస్థాన్ లో రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పాకిస్థా న్ ముస్లీంలీగ్ – నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ .. కలిసి మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. పిఎంఎల్ -ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి తన సోదరుడు షాబాజ్ షరీఫ్ పేరును ప్రతిపా దించారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం కారణంగా పదవికి రాజీనామా చేయడంతో షాబాజ్ షరీఫ్ ప్రధానిగా ప్రతిపక్షకూటమి ప్రభుత్వం సాగింది. జైలులో ఉన్న పాకిస్తాన్ తాహ్ రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటును ఖండించారు. తమకే మెజారిటీ ప్రజల మద్దతు ఉందని తేటతెల్లం అయినట్లు తెలిపారు.
షాబాజ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఉంది. ఆరు పార్టీ లు- పిఎంఎల్ -ఎన్, పిపిపి, ఎంక్యూఎం- పి, పిఎంఎల్- క్యూ పార్టీలు, ఐపీపీ, బిఏపీ పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా యి. వీరికి మొత్తం 152 మంది సభ్యుల మెజారిటీ ఉంది. 60 మంది మహిళలు, పది మైనారిటీ సీట్లను కలుపుకుంటే.. పాకిస్థాన్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 169 మంది సభ్యుల మెజారిటీ లభిస్తుంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ ను పాకిస్థాన్ ముస్లీం లీగ్ – నవాజ్ పార్టీ ఎంపిక చేసింది. సంకీర్ణ ప్రభు త్వం ఏర్పాటులో మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకులు జర్దారీ, బిలావల్ కు ప్రధాని అభ్యర్థి షాబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకున్నా.. దేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు ఏకం కావాలని పలు రాజకీయపార్టీలు సిద్ధమయ్యాయని పిపిపి కో చైర్ పర్శన్ అసిఫ్ అలీ జర్దారీ తెలిపారు.


