ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా కాస్తంత ఎక్కువగా మరికాస్త తక్కువగా కూడా ఉండేది. ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజమే. అయితే, మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణో గ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నా రు. ఇలా టెంపరేచర్లు ఎడాపెడా పెరగడం అంతి మంగా ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగిస్తోందంటున్నారు శాస్త్రవే త్తలు.
వాతావరణ మార్పులకు గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ అంటే సూర్యు డి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌజ్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. దీని ఫలితంగా, వాతా వరణం మనం ఊహించనంతగా వేడెక్కుతోంది. ఫలితంగా ఎండలు మండిపోతున్నాయి. భూగోళం చరిత్రలో పాతికేళ్ల కిందటి నుంచి అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నది ఒక అంచనా. ఈ పెరుగు దల మూడు నుంచి ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్‌లు కూడా ఉండొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది. వాతావ రణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే, గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తోంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పచ్చ టి ప్రదేశాలు కాలక్రమంలో ఎడారులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.
వాతావరణ మార్పుల ప్రభావం పంటల దిగుబడిపై కూడా పడుతోంది. ఫలితంగా ఆహార భద్రత ఒక సవాల్ గా మారుతోంది. అంతిమంగా తిండి గింజల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా రావచ్చు అని హెచ్చ రిస్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు అనేక దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నా రు. మనదేశంలో ఆకలి మరణాలు లేవు కానీ పోషకాహార లోపం సమస్య ఉంది. మరో పదేళ్లకు గోధుమలు, మొక్కజొన్న వంటి పంటల దిగుబడులు కొంత మేర తగ్గవచ్చన్నది ఒక అంచనా. వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే భవిష్య త్తులో పోషకాహార లోపం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. చివరకు ఈ ప్రభావం చిన్నారులపై పడటం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో పోషకాహార లోపం అనే అంశం తెరమీదకు రాబోతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక సంయుక్త కార్యాచరణకు సిద్దం కావాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదిలాఉంటే మనదేశంలో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది రైతులు వలస బాట పడుతున్నారు. కట్టుకున్న ఊరిని, కన్నవాళ్లను వదలివేసి పిల్లా పాపలతో వలసలు పోతున్నారు. తట్టాబుట్టా సర్దుకుని సమీపానగల పట్టణాలకు తరలిపోతున్నారు. పట్టణాల్లో ఎక్కువగా భవన నిర్మాణ కూలీలుగా మారుతున్నారు. లేదంటే చిన్నా చితకా పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కొన్నిసార్లు పట్టణాల్లో కూడా పనులు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలాఉంటే, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈ యుద్ధం ఇంకెన్ని సంవత్సరాలు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అనేక ఆఫ్రికన్ దేశాలపై పడింది. ఇప్పటికే అనేక ఆఫ్రికా దేశాల్లో నిత్యావసరాల కటకట ఏర్పడింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనేక దేశాల్లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా దేశాల్లోని ప్రజలు తిండిగింజలకు కూడా నోచుకోని పరిస్థితులు భవిష్య త్తులో నెలకొంటాయని హెచ్చరిస్తున్నారు ఆహారరంగ నిపుణులు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోననే భయంతో అనేక ఆహార ఉత్పత్తి దేశాలు సరకులను నిల్వ చేసుకుంటున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఆహార సరఫరా గొలుసు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సహజంగా నల్ల సముద్ర ప్రాంతం నుంచి ఆహార సరఫరాలపై పలు ఆఫ్రికా దేశాలు ఆధారపడతాయి. రానున్న రోజుల్లో ఈ దేశాల పరిస్థితి మరింత దయనీయం గా మారుతుందన్నది నిపుణులు చేస్తున్న హెచ్చరిక. ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత అనేది కీలకాంశం. అనేకానేక కారణాలతో ఆహార భద్రత ఒక సవాల్‌గా మారబోతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేమైనా భవిష్యత్తులో తిండిగింజలకు ప్రపంచ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.