Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

                వాతావరణ మార్పులు భూమికి ఎప్పుడూ అతిపెద్ద సవాలే. అనేక కారణాలతో కాలుష్యం పెరిగిపోతోంది. ఫలితం గా ప్రతి ఏడాది వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వేసవితో సంబంధం లేకుండా ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది ఎండకాలమా వర్షకాలమా లేదా చలికాలమా చెప్పడానికి వీలు లేకుండా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

             ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతోంది. ప్రస్తుత భూతాపాన్ని పరిశీలిస్తే, 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తీవ్రమైన వడగాడ్పులు, నిప్పులు కురిపించేంతటి ఉష్ణోగ్రతలు, ఇక నుంచి పదేళ్లకోసారి వస్తాయంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక పచ్చటి ప్రదేశాలు, కాలక్రమంలో ఎడారులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే, చివరకు జనానికి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదంటున్నారు శాస్త్రవేత్తలు.

              అనేకదేశాల్లో ఇప్పటికే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగితే ఆ ప్రభావం అనేక దేశాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్‌, పాకిస్థాన్‌, చైనా, ఆఫ్రికాలోని పలు అధిక జనసాంద్రత గల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని ప్రోసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ సైన్సెస్ జర్నల్‌ నివేదిక వెల్లడించింది. ప్రజలు తట్టుకోలేనంతగా ఎండలు వస్తాయని ఈ జర్నల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలుగా అనేక నగరాలున్నాయి. వీటిలో భారత్‌కు చెందిన ఢిల్లీ,కోల్‌కతాతో పాటు షాంఘై, ముల్తాన్‌, నాన్జింగ్‌, వుహాన్‌ వంటివి ఉన్నాయి. ఈ నగరాల్లో టెంపరేచర్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ నగరాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో పని చేస్తుంటారు. దీంతో వీరు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

          2015లో 196 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని ఈ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్-IPCC ప్రకారం, ఈ శతాబ్దం చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో కర్బన ఉద్గారాలు భారీ సంఖ్యలో విడుదల కావడమే అంటున్నారు సైంటిస్టులు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రపంచం ఉద్గారాలను సగానికి తగ్గించాలని IPCC పేర్కొంది. ఇదిలా ఉంటే కిందటేడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు…ఈ నాలుగు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో 2023 అత్యంత వేడి సంవత్సరంగా ప్రపంచ పటంపై అవతరించింది.

           భూతాపాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి. అయితే ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. కాలుష్యాన్ని అరికట్టలేకపోతున్నాయి. దీంతో భూమి, నిప్పుల కొలిమిగా మారుతోంది . 2023 నుంచి 2027 వరకు భూగోళంపై ఎండ వేడి మరింతగా పెరుగుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావంతో ప్రజారోగ్యం, ఆహార భద్రత, జలవనరులు, పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే కాలుష్యం తగ్గించుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు నిపుణులు.

            ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా 1960 నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైంది. 2015 తర్వాత వరుసగా ఎనిమిదేళ్లు భూగోళంపై అత్యంత వేడి రికార్డు అయింది. రానున్న కాలంలో ఈ వేడి మరింగా పెరుగుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డైయాక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌లు వాతావరణంలో ఎక్కువగా ఉండటమే వేడి ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని సైంటిస్టులు అంటున్నారు.

        విపరీతమైన వేడిమితో భూమి మండిపోడానికి గ్రీన్‌హౌస్ వాయువులు ఒక్కటే కారణం కాదు. మన జీవనశైలి కూడా వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఉష్ణోగ్రతలను తట్టుకోడానికి ప్రజలు వాడే ఎయిర్ కండిషనర్లు, వాతావరణంలో వేడిని మరింత ఎక్కువగా రగుల్చుతున్నాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు విడుదల చేసే వాయువుల వల్ల కాలుష్యం బాగా పెరిగిపోతోంది. ఓ అధ్యయనం ప్రకారం దాదాపు ముప్ఫయి ఏళ్ల నుంచి ఎయిర్ కండిషనర్ల వినియోగం బాగా పెరిగింది. వచ్చే ఆరేడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల ఏసీల వినియోగం పెరగనుందని చెబుతున్నారు. 2040 కల్లా దాదాపు 200 కోట్ల ఏసీలను ప్రజలు వినియోగిస్తారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతిమంగా ఎండవేడి మరింతగా పెరుగుతోంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా నదులు ఎండిపోతున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, ఆ ప్రభావం నదులపై పడుతుంది. పెరిగిన టెంపరేచర్లు దెబ్బకు అనేక చోట్ల నదులు ఎండిపోతున్నాయి. అంతిమంగా ప్రజలకు తాగునీటి కటకట ఏర్పడుతోంది.

          నీటి విషయంలో భారత్‌లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేవు. 2050 నాటికి భారత్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక తేల్చి చెప్పింది. ప్రపంచదేశాల్లో నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి ఇటీవల మూడు రోజుల పాటు కీలక సమావేశం నిర్వహించింది. నీటి ఎద్దడిని నివారించడానికి అంతర్జాతీయస్థాయిలో బలమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటిరంగ నిపుణులు. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతంలోనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆ లక్ష్యానికి ప్రపంచదేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యా నికి చేరుకోవడానికి ఏడాదికి 600 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఎడాపెడా పెరుగుతున్న నీటి ఎద్దడి, అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడు స్తున్న వైనం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్ వార్మింగ్ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొన్నారు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్