భారతదేశం హాంగ్ కాంగ్ ను అధిగమించి ప్రపంచంలో నాల్గో అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా ఆవిర్భవించింది. దక్షిణా సియా నెంబర్ 1 స్టాక్ మార్కెట్ గా ఎదిగింది. ఇన్వెష్టర్ల చిత్తశుద్ధి, విధాన పరమైన సంస్కరణల ఫలితంగా భారత స్టాక్ మార్కెట్ గొప్పగా అభివృద్ధి చెందింది. బ్లూమ్బెర్గ్ ప్రకటించిన డేటా ప్రకారం, భారత ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ లో ఉన్నసం స్థల షేర్ల మొత్తం విలువ సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది, హాంకాంగ్ స్టాక్ మార్కెట్ షేర్ల మొత్తం విలువ 4.29 ట్రిలియన్ డాలర్లు. దీంతో భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ గా అవతరించింది. దీని స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 5 న మొదటిసారి 4 ట్రిలియన్ డాలర్లను దాటింది.


