25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొనేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాలు

       తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనాప రంగా ప్రక్షాళన దిశలో ముందుకు వెళుతున్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేసిందని ఆరోపి స్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నిటిని చక్కపెట్టే దిశలో చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థతోపాటు ఇతర వ్యవస్థలు ప్రక్షాళన జరిగితే తప్ప పాల‌నా ప‌రంగా పార దర్శకత వచ్చే అవకాశం లేదని ముఖ్య మంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు, శాఖల వారీగా సమీక్షలు చేస్తు న్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షలు చేస్తున్నారు.

           గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది రేవంత్ స‌ర్కార్. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్తు జరుగుతోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళ ణకు చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే దిశలో చర్యలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి 4వ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్ర‌భుత్వానికే దక్కింది. అందుబా టులో ఉన్న నిధులను రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమం కొనసాగుతోంది. మరో వైపు రైతు రుణ‌ మాఫీ రెండు లక్షల వరకు ఒకేసారి చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. 30 వేల కోట్ల వరకు రైతు రుణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమవుతోంది. బ్యాంకులకు విడతలవారీగా చెల్లించి రైతుపై ఉన్న రుణభారాన్ని తొలగించే దిశలో కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పాలనాపరంగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పి కొట్టాలని నిర్ణయించింది.

              ప్రభుత్వం చేబడుతున్న ప్రతి కార్యక్రమంపై విపక్షాలు విమర్శలు చేయడానికి కాంగ్రెస్ రాష్ట్రనాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని, రెండు లక్షల రుణమాఫీ చేయలేదని, ఎయిర్ పోర్టు మెట్రో, ఫార్మాసిటీ ప్రాజెక్టులు రద్దు చేస్తోందని, ప్రభుత్వం కూలుతుందని ఇలా ప్రతి అంశంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ పధకాల అమలు విషయంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విమర్శలను తిప్పి కొట్టాలని నిర్ణయించింది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాలని ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రులతోపాటు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఎదురు దాడి చేసి ప్రతి పక్షాల విమర్శలు ఆ వాస్తవమని చెప్పాలని స్పష్టం చేసింది.

          పార్టీ బలోపేతానికి మంత్రులు పర్యటనలో జిల్లాల్లో జిల్లా కార్యాలయాలకు, హైదరాబాద్ లో గాంధీభవనకు తరచూ వచ్చేట ట్లు కార్యాచరణ సిద్ధం చేస్తోంది హ‌స్తం పార్టీ. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దాడిని ఎదురొడ్డి తిప్పికొట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. మంత్రులతోపాటు సీనియర్ నాయకులు మల్లు రవి, జగ్గారెడ్డి, మధుయాష్కి, హనుమంత రావు , మహే ష్ కుమార్ గౌడ్, వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదండ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఆదివాసి కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, దళిత విభాగం చైర్మన్ ప్రీతం, అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యద ర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, అద్దంకి దయాకర్, భవాని రెడ్డి లాంటి గొంతెత్తి గళంవిప్పే నాయకులు ఎదురు దాడి చేయాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని నాయకులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

               మొత్తంగా విప‌క్షాల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టే వ్యూహానికి కాంగ్రెస్ ప‌దును పెడుతోంది. బీఆర్ఎస్ స‌ర్కార్ లో జరిగిన అక్రమాల‌కు న్యాయ విచార‌ణ‌కు ఆదేశించ‌డంతోపాటు..బీఆర్ఎస్ విమ‌ర్శ‌ల‌ను దీటుగా తిప్పి కొట్ట‌డం ద్వారా పై చేయి సాధించాల‌ని కాంగ్రెస్ ప‌ట్టుద‌ల‌గా ఉంది. అయితే కాంగ్రెస్ వ్యూహం ఎంతమేర సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే .

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్