Free Porn
xbporn
22.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ప్రతిపక్షాల నేతలపై ఆగని ఈడీ దాడులు

        దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా, వారిపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. సహజంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తుంటారు. నరేంద్ర మోడీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు ఎక్కుపెడుతుంటారు. దీంతో ఎవరు రచ్చ చేస్తే వారిపై కేసులు పెట్టి నోరు నొక్కివేసే కార్యక్రమం విజయవంతంగా అమలు అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగా ప్రతిపక్ష నేతలపైనే ఈడీ లేదా సీబీఐ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో విపక్షాల విమర్శల్లో వాస్తవం ఉందన్న అభిప్రాయాలు సాధారణ ప్రజల్లో నెలకొంటున్నాయి.

     జాతీయ రాజకీయాల్లో బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ భిన్న ధృవాలు. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేం తటి రాజకీయ వైరం ఉంది. ఈనేపథ్యంలో ఎక్సయిజ్ పాలసీకి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ ఒక ప్రముఖుడు. ఆమ్ ఆద్మీ పార్టీ నూటికి నూరుశాతం కేజ్రీవాల్ బుర్రకు పుట్టిన ఆలోచన. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీతో హోరాహోరీ రాజకీయ పోరు నడిపిన ఘనత ఆయనది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం పంజాబ్‌లో కూడా అధికారంలో ఉంది. అంతేకాదు…దాదాపు రెండేళ్ల కిందట ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించింది. ఇంతటి ఘన చరిత్రగల కేజ్రీవాల్‌పై ఎక్సైజ్ పాలసీ పేరుతో కేసులు పెట్టింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.

    మరోవైపు ఏడేళ్లనాటి ఒక కేసును అడ్డం పెట్టుకుని ఢిల్లీకి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేంద్ర జైన్‌ను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలున్నాయి. చివరకు సత్యేంద్ర జైన్‌ జైలుకు పోయేంతవరకు ఎన్‌ఫోర్సె మెంట్ డైరక్టరేట్ నిద్రపోలేదన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఆరోపణ. జైలుకు వెళ్లడంతో నైతిక విలువలకు కట్టుబడి మంత్రి పదవికి సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు. తాను విలువలకు కట్టుబడ్డ రాజకీయనేతనని నిరూపిం చుకున్నారు. మహారాష్ట్రలోనూ రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కత్తిదూసిందన్నది మరో ఆరోపణ. అనిల్ దేశ్‌ ముఖ్, నవాబ్ మాలిక్ … ఇద్దరూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు. కేసులను అడ్డం పెట్టుకుని వీరిద్దరినీ దర్యాప్తు సంస్థలు జైలుకు పంపాయని ఎన్సీపీ నేతలు గతంలో ఆరోపించారు. నాలుగేళ్ల కిందటి గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కేంద్రం ఇటీవల టార్గెట్‌ చేసిందన్న వార్తలొస్తున్నాయి. కేరళలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికే బంగారం స్మగ్లింగ్ కేసుపై కేంద్ర దృష్టిపెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

      కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు పరోక్షంగా ప్రతిపక్షాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చింది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలోని తొమ్మిది ప్రతిపక్ష పార్టీలు కిందటి ఏడాది మార్చి నెలలో సంయుక్తంగా లేఖ రాశాయి. ప్రతిపక్ష నేతలను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్న తీరు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించాయి. దేశ రాజకీయాల్లో దర్యాప్తు సంస్థల పనితీరు ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షపార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థల సాయంతో కేంద్ర ప్రభుత్వం కక్షసాధిస్తోందన్న ఆరోపణలు తరచూ వస్తున్నాయి.

      కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకు కొన్ని ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. అవినీతిపరులను, అక్రమార్కులను కట్టడి చేయడమే సీబీఐకు ప్రత్యేకాధికారాలు ఇవ్వడంలోని ప్రధానోద్దేశం. అయితే సీబీఐ పనితీరు వివాదాస్పదంగా మారిం దన్న ఆరోపణలు ఇటీవలికాలంలో తరచూ వినిపిస్తున్నాయి. సహజంగా ప్రతి రాష్ట్రంలో అవినీతి కట్టడికి యాంటీ కరప్షన్ బ్యూరో …ఏసీబీ ఉంటుంది. అయితే సహజంగా హై ప్రొఫైల్‌ కేసుల గుట్టు విప్పడానికి సీబీఐను ఆశ్రయిస్తారు. 2014లో కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన తరువాత సీబీఐ పాత్ర దేశ రాజకీయాల్లో పెరుగుతూ వస్తోంది. అయితే సీబీఐ పెట్టిన కేసులు చాలావరకు న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. సీబీఐ కేసులను కోర్టులు కొట్టేస్తున్నాయి. సీబీఐ దశాబ్ద కాలంలో టేకప్ చేసిన కీలక కేసులేవీ ఒక కొలిక్కి రాలేదన్న విమర్శలున్నాయి. దీంతో సీబీఐ ఇమేజ్ కొంతమేర డ్యామేజ్ అయింది. అంతేకాదు సీబీఐ విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. అటు కేంద్రప్రభుత్వంలోని పెద్దల మాటను కాదనలేక ఇటు న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోలేక సీబీఐ సతమతమవుతోందన్న ఢిల్లీ రాజకీయ వర్గా ల కథనం. కొన్నేళ్ల కిందట సీబీఐలోని డైరక్టర్‌, జాయింట్ డైరక్టర్ ఓ కేసు విషయంలో ఘర్షణ పడటం కూడా సంస్థ కు చెడ్డపేరు తీసుకొచ్చింది.

      ఒకప్పుడు లోకల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కంటే సీబీఐ సమర్థవంతంగా పనిచేస్తుందనే పేరు ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితా మారి మారింది. ఏదైనా కేసు సీబీఐ చేతుల్లోకి వెళితే తెరమరుగైనట్టేననే అభిప్రాయం బలపడు తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటివరకు పేదరిక నిర్మూలన జరగలేదు. అనేక గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేదు. తాగునీటి సౌకర్యం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. మరోవైపు ఉపాధి వెతుక్కుంటూ పల్లె జనం పట్టణాలకు వలస వెళుతున్నారు. ఈ మౌలిక సమస్యలకు పరిష్కా రాలు చూపడం మానేసి, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడంలో భాగంగా దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీబీఐను పంజరంలో చిలక అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. ఈ వ్యాఖ్య ఒక్క సీబీఐకే పరిమితం కాదు. ఈడీ సహా అన్ని దర్యాప్తు సంస్థలకు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య వర్తిస్తుంది. ఇవన్నీ కేవలం అపవాదులేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపైనే ఉంది. పారదర్శక పనితీరుతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు మునుపటి గౌరవాన్ని సాధించుకోగలవు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్