ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ప్రజా భవన్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా హాజరు కావాలని సీఎం ఆదే శించారు. ఇరిగేషన్‌పై రేపు శేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకలపై ఎమ్మేల్యే, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్‌లో చేసిన అవినీతిపై సీఎల్పీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజం టేషన్ ఇవ్వనున్నారు. రేపు అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశంపై, ఏం మాట్లాడాలన్న దానిపై ఈరోజు సీఎల్సీలో నేతలు చర్చించనున్నారు. ఈ నెల 13న మేడిగడ్డ ఫీల్డ్ విజిట్‌లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చ జరగనుంది. గత ప్రభుత్వ ఇరిగేషన్ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్ల డంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నారు.మరోవైపు శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మె ల్యేలతోపాటు శాసనమండలిలో ఉన్న 40 మంది సభ్యులు ప్రాజెక్టు సందర్శనకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు శాసన సభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.