29.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

ప్రజలకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణయం

      తెలంగాణలో ప్రభుత్వానికి ..కాంగ్రెస్ పార్టీకి మధ్య స‌మ‌న్వ‌యం పెంచేలా కార్య‌చ‌ర‌ణ సిద్దం అయింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి…వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీ భవన్ కు వచ్చి, పార్టీ శ్రేణులకు అందు బాటులో ఉండనున్నారు. ప్రజాభవన్ లో వారానికి రెండు రోజులు ప్రజల నుంచి వినతులు సేకరిస్తున్నట్లు గానే… గాంధీ భవన్ లో కూడా వారంలో రెండు రోజులు పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి కూడా వినతులను స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి లేదా, మంత్రులు కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయడం విశేషం.

        తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కార్యకలాపాలలో వేగం తగ్గింది. కొత్తగా ఏర్పాటైన ప్రభు త్వం కావడంతో పరిపాలనపై పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి, మంత్రులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ సమీక్షలతో సీఎం, మంత్రులు బిజీ బిజీగా గడుపుతుండడంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు ఆశించిన రీతిలో సమయం కేటాయించలేక పోతున్నారన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పార్టీకి, ప్ర‌భుత్వానికి మధ్య గ్యాప్ పెరిగితే, మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని నేత‌లు హెచ్చరిస్తున్నారు.

       పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు పీసీసీ అధ్యక్షుడు కానీ, ఇతర నాయకులు గానీ అందుబాటులో లేకపో వడం ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనబడుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో పార్టీ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహించి, పార్టీని బలోపేతం చేసే కృషి ముమ్మరం చేయాల్సి ఉంది. అదేవిధంగా ప్రజాపాలన దిశగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీపై కూడా దృష్టి సారించాల్సి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

      2014 లోక్ సభ ఎన్నికలకు ముందే… క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, దీపా దాస్ మున్షి లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, పార్టీ సీనియ‌ర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ప్రజా భవన్ లో వారానికి రెండు రోజులు పాటు ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లుగా గాంధీభవన్ లో కూడా పార్టీ కోసం కాంగ్రెస్ వాణి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా వారానికి రెండు రోజులు మంత్రు లు అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో నాయకులు, సామాన్య కార్తకర్తలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.

        ప్రతి 15 రోజులకు ఒక రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతి వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్ లో అందుబాటులో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గాంధీభవన్లో ప్రతి బుధవారం శుక్రవారం గాని లేదా శనివారం గాని ఏదో ఒక మంత్రి మూడు గంటలపాటు అందుబాటులో ఉండి కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణుల నుంచి వినతులు స్వీకరిస్తారు. పార్టీ పరంగా వచ్చే విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయా లని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ లో చ‌ర్చించి తుది నిర్ణయం తీసుకుంటామ‌ని హ‌స్తం నేతలు చెబుతు న్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్