2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ.. అనంతపురం జిల్లాలోనూ రాజకీయ వేడి రగిలింది అటు వైసీపీలోనూ, ఇటు తెలుగుదేశం పార్టీలోనూ టికెట్లకోసం నాయకుల ప్రయత్నాలు మమ్మరంగా సాగుతున్నాయి. సీఎం జగన్ చేపట్టిన మార్పులూ, చేర్పులతో అనంతపురం జిల్లా పెనుగొండ వైసీపీలో చిచ్చురగిలింది. టికెట్ కోసం కొందరు నాయకులు ఎన్నో తంటాలు పడుతుంటే.. స్థాన చలనంతో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి పెచ్చుపెరిగింది. లోకల్ లీడర్లు రోడ్డెక్కుతున్నారు. ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మంత్రి ఉష శ్రీ చరణ్ కు కేటాయిస్తున్నారన్న వార్త నేపథ్యంలో, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ కొంత అసహనంతో ఉన్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న పెనుకొండలో శంకర్ నారాయణ 2019 ఎన్నికల్లో నెగ్గి పెనుకొండ కోటలో వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగరవేశారు. తర్వాత ఆయనకు సీఎం జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. కొంతమంది నాయకులు మాజీ మంత్రి శంకర్ నారాయణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యతిరేక వర్గం గా పనిచేస్తున్నారు. వారిలో టికెట్ ఆశించే ప్రముఖులు ఉన్నారు. వారంతా, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మంత్రి ఉషశ్రీ చరణ్ తాను పెనుకొండ నుండి పోటీ చేస్తున్నానని మీడియా ముఖంగా తెలపడంతో ఒక్కసారిగా పెనుకొండలో రాజకీయ వేడి రాజుకుంది. లోకల్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఉండగా స్థానికేతులను ఇక్కడ గోదాలోకి దిగితే ఓటమి తప్పదంటూ శంకర్ నారాయణ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఒకవేళ శంకరన్నకు టికెట్ ఇవ్వకపోతే, తాము ఉషశ్రీ చరణ్ కు ఎట్టి పరిస్థితులలోనూ మద్దతు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి ఇది ఆత్మహత్యా సదృశ్యమేనని అంటూ కొందరు నాయకులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు.
ఇలాంటి సమ
మరో పక్క చిన్నారెడ్డి కుమార్తె సానే ఉమారాణి టికెట్ ఆశిస్తూ, నియోజకవర్గం కలియ తిరుగుతూ తనవంతు ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ వర్గానికి చెందిన మరొక నాయకుడు, మాజీ మంత్రి ఎస్ నారాయణ రెడ్డి కుమారుడు ఎస్ రమాకాంత్ రెడ్డి కూడా నేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరో నాయకుడు పొగాకు రామచంద్ర రావు టికెట్ సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఉషశ్రీ చరణ్ తెరపైకి రావడంతో నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉషశ్రీ చరణ్ మాకొద్దు అంటూ నిరసనలు వెల్లువెత్తాయి
తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, సవితమ్మల మధ్య పోటీ తారస్థాయిలో సాగుతోంది. టికెట్ కోసం ఇద్దరూ ప్రయత్నాలు ముమ్మరంచేశారు. దీంతో కార్యకర్తల మధ్య విభేదాలు జోరుగానే ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం అధినాయ కుడి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలో మరొక బీసీ నేత కురువ కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చింది. పెనుకొండ టికెట్ తనకు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని, ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు నిమ్మల కిష్టప్ప కుమారునికి కూడా టికెట్ ఆశీస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పెను గొండ రాజకీయం ఈ చలికాలంలోనూ గరం గరం గా సాగుతోంది. వైసీపీ, టీడీపీ ధీమాతో సాగుతున్నాయి. టికెట్ ఎవరికి కేటాయించినా, ప్రజలు అధికారాన్ని ఏ పార్టీకి కట్టబెడతారో వేచి చూడాలి.