Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

పూర్తికాని దక్షిణ మధ్య రైల్వే పనులు ….అందని ఎంఎంటీఎస్ సేవలు

      స్టేషన్ లో ప్లాట్ ఫామ్ మీదకు రావాల్సిన రైలే కాదు…. రైల్వే ప్రాజెక్టులు కూడా లేటే అన్న ప్రజాభిప్రాయాలకు అను గుణంగా దక్షిణ మధ్య రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపే ఎంఎంటీ ఎస్ రెండవ దశ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. 2012 లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంఎంటీఎస్ కు ఆదరణ తగ్గినా ఫేజ్ 2 కంప్లీట్ చేస్తే ప్రజలకు చేరువకావచ్చు. ఎంఎం టీఎస్ ఫస్ట్ ఫేజ్ మూడేళ్లలో పూర్తిచేసినా, రెండో ఫేజ్ పనులు 12 ఏళ్లుగా సాగుతున్నాయి.

      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండోదశలో 2024 జనవరిలో సికింద్రాబాద్ – ఘట్ కేసర్ ఎంఎంటీఎస్ ను పట్టా లెక్కిస్తామన్న రైల్వే జీఎం మాటలు అమలుకు నోచుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్‌లో కేంద్రం 600 కోట్ల రూపాయలు కేటాయించినా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లా సాగాల్సిన పనులు ప్యాసింజర్ లా సాగుతు న్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు జనాభా విస్తరించడంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ కు డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సౌకర్యాలు పెంచడంలో సౌత్ సెంట్రల్ రైల్వే విఫలమైంది. 817 కోట్ల రూపాయలతో శివారు ప్రాంతాలైన బొల్లారం, రామ చంద్రాపురం, మేడ్చల్, ఉందానగర్, మౌలాలి, ఘట్ కేసర్ రూట్లలో అంటే ఆరు రూట్లలో ప్యాసింజర్ కనెక్టివిటీ పెంచేందుకు ఎంఎంటీఎస్ ఫేజ్ టూ పనులకు శ్రీకారం చుట్టారు. 12 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఏళ్లు గడిచి, ప్రాజెక్ట్ బడ్జెట్ పెరిగింది తప్ప పనులు పూర్తి కాలేవు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌లో సనత్ నగర్ – మౌలాలి, సికింద్రాబాద్ – ఘట్ కేసర్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

           ఉందానగర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్‌కు మంచి ఆదరణ ఉంది. ఇక ఇప్పటికే పూర్హైన బొల్లారం – మేడ్చల్, లింగంపల్లి – రామచంద్రాపురం రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడం, నడుస్తున్నా వాటి వివరాలు యాప్ లో కనిపించక పోవడంతో ప్రయాణికులకు క్లారిటీ లేకుండా పోయింది. ప్రధాని మోడీ వచ్చి గత ఏడాది 13 కొత్త సర్వీసులను ప్రారంభించి ప్రచారం చేసినా, రైల్వే అధికారులు మాత్రం ఎంఎంటీ ఎస్ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నడుస్తున్న మెట్రో రైల్ ద్వారా రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మెట్రో రైళ్లతో ఏ మాత్రం తీసిపోని కొత్త ఎంఎంటీఎస్ రైళ్లలో 50 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. గతంలో ఎంఎంటీఎస్ ఆర్టీసీ కంబైన్డ్ పాస్ ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఎంఎంటీఎస్ దిగిన తర్వాత సరైన బస్సు సౌకర్యం, కనెక్టివిటీ లేకపోవడంతో
ఎంఎంటీఎస్ వైపు ప్రయాణీకుల మొగ్గుచూపడం లేదు.

      ప్రస్తుతం హైదరాబాద్ లో మెట్రో రైల్ రాపిడో, ఓలా , ఊబార్ లాంటి ట్యాక్సీ సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కానీ తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు నాటికి నేటికి ఒక్క ఎంఎంటీఎస్ లో మాత్రమే ఉంది. ఎన్ని ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు వచ్చినా ట్రాఫిక్ జామ్, సౌండ్ పొల్యూషన్ లేకుండా తీసుకెళ్లే ఎంఎంటీఎస్ లోనే రెగ్యులర్ గా ప్రయాణించేవారెందరో . ఈ ప్రయాణికులకోసమైనా ఎంఎంటీఎస్ రెండోదశ తక్షణం పూర్తిచేయాలి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్