25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్

       బీజేపీలో అప్పుడే పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావాహులు పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురికి మాత్రమే పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

       పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ నుంచి పదికి పైగా ఎంపీ సీట్లను కొల్ల గొట్టాలని బిజెపి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పార్టీలోని అన్ని విభాగాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే బీజేపీ తెలంగాణలో యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ స్థానంపై అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఇక మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అధినాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది.

      పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై కింద స్థాయి నుంచి ప్రక్షాళన ప్రారంభించింది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలోనే పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీల ఎంపిక పూర్తి చేసినట్టు తెలు స్తోంది. ఎంపీ టికెట్ల విషయానికి వస్తే మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డికె అరుణ పోటీ పడుతు న్నారు. చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి మరికొంత మంది పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. భువనగిరి అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్, రాణి రుద్రమ పేర్లు వినిపిస్తున్నాయి. అటు వరంగల్ నుంచి మాత్రం రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ పేరు మాత్రమే వినబడుతోంది.

       మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి పరాజయం పాలైన ఈటెల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మల్కాజిగిరి ఎంపీగా ఈటెల పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తు న్నారు. అయితే అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. మల్కాజిగిరి స్థానం లో గతంలో రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గ నేతలే విజయం సాధించారు. పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో రెడ్డి వర్గానికి చెందిన నేతలే విజయం సాధించారని.. దీనిని దృష్టిలో ఉంచుకుని కూకట్ పల్లికి చెందిన పన్నాల హరీష్ రెడ్డి తనకే మల్కాజిగిరి టికెట్ ఇవ్వాలని పార్టీపై వత్తిడి తీసుకువస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు బీజేపీ జాతీయ నేతలు మురళీధర్ రావు, వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి మల్కాజిగిరి టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారట. ఇక జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో గట్టి పోటీ ఉంది. ఈ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు జహీరాబాద్ సీటు కోసం బీజేపీలో అడ్వకేట్ రచనారెడ్డి, చీకోటి ప్రవీణ్, ఆకుల విజయ, విఠల్ తదితర నేతలు పోటీపడుతున్నారు.

        ఇదిలా ఉంటే మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్ రావును మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయి. హైదరా బాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి విరించి ఆస్పత్రి ఛైర్మన్ మాధవిలత, భగవంత్ రావు పేర్లు వినబడుతున్నా యి. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు స్థానంలో… రమేశ్ రాథోడ్‌ను బరిలో దింపాలని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ టికెట్లు దక్కనివారు …నిరాశ చెందకుండా వారికి తగిన విధంగా పార్టీ పదవులు గానీ నామినేటెడ్ పదవులు గానీ ఇస్తామని అధిష్టానం వారిని బుజ్జ గించే ప్రయత్నం చేస్తోంది. అసమ్మతిని తగ్గించడానికి పార్టీలో టికెట్లు ఆశించిన ముఖ్య నేతలకు ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించే అవకాశాన్ని పరీశీలిస్తోంది.మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడానికి బీజేపీ వ్మూహత్మకంగా ముందుకు వెళ్తోంది. మరి ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్