దేశంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్లమెంటు ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయాత్తమవుతున్నాయి. తెలంగాణలో నూ ఇదే వేడి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావే శం నిర్వహించిన కేటీఆర్. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల , మానకొండూరు, హుజరాబాద్, హుస్నాబాద్, కోరుట్ల నియోజవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు జడ్పీటీసీలు ఎంపీపీలతో సమీక్ష సమావేశం అవుతున్నారు. నిన్న ఆదిలాబాద్ పార్లమెంట్ సమావేశంలో నాయకులు,కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయ నున్నారు.


