29.1 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

పార్లమెంటు సీట్లు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఫోకస్

    తెలంగాణ కాంగ్రెస్ లో లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కమిటీ సమావేశంలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయి..? టార్గెట్ ఫిక్స్ చేసుకొని మరీ ఎన్నికల యుద్దానికి రాష్ట్ర నాయకత్వం సిద్దమౌతుందా? పీఈసి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లేనా..? అసలు సమావేశం లో పీఈసీ సభ్యులు తేల్చిన లెక్కలు ఎంటి?. ఇంతకీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏటి..?

     తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ హై కమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఆ దిశగా ఇప్పటికే వరుస సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల ఎజెండాను సిద్దం చేసింది. దానిలో భాగంగా అభ్యర్థుల వడపోత, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార శైలి, ఇతర ఆంశాలపై పీఈసీ లో కీలక అంశాల మీద చర్చ జరిగింది. పీఈసీ చైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు.

     పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలని రేవంత్ రెడ్డి సమావేశంలో నేతలకు దిశ నిర్దేశం చేశారు. మరో 60 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక పై చర్చ జరిగింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావహుల జాబితాను పీసీసీకి అందాయి. ఈ ఎంపిక బాధ్యతలు మొత్తం ఏఐసీసీ కార్యదర్శి హరీష్ చౌదరి చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీకి అందచేస్తారు. వాటిపై చర్చించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కమిటీ స్క్రూటినీ చేసిన నివేదికను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కి సిఫారసు చేస్తుంది. మార్చ్ 20 నుంచి 25 వరకు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేసి అధిష్టానం తుది జాబితాను ప్రకటిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

    గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను మరో సారి పదును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే టిక్కెట్ ఆశావహుల నుంచి తీసుకున్న దరఖాస్తులు మాదిరి గానే పార్లమెంట్ ఎన్నికలకు కూడా దరఖాస్తులు గాంధీ భవన్ కు అందజేయాలి. అయితే దరఖాస్తు ఫీజు జనరల్ క్యాటగిరి అభ్యర్థులకు 50వేలు,ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 25వేలు గా నిర్ణయించారు.దీంతో మరో సారి ఆశావహుల నుంచి పెద్ద ఎత్తున 17 పార్లమెంట్ స్థానాల నుంచి దరఖాస్తు వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా భావించే ప్రాంతం..ఆదిలాబాద్ ఇంద్రవెల్లి కేంద్రంగా ఫిబ్రవరి 2 పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించబోతున్నారు.

    ఇంద్రవెల్లి బహిరంగ సభ తో ఎన్నికల ప్రచారం ప్రారంభించి 17 పార్లమెంట్ నియోజకవర్గంలో, అన్ని జిల్లాలో సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అంతేకాక ఆశవహుల్లో ఏ ఒక్కరినీ నిరశపరచకుండా దరఖాస్తులు తీసుకోనున్నారు. అభ్యర్థుల ఎంపిక లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అప్రతిష్ఠ మూటగట్టుకోవద్దని ఉద్దేశంతో హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగిస్తూ.. పీ ఈ సీ లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ, బీఆర్ఎస్ బంధాన్ని తెరపైకి తేవాలని కాంగ్రెస్ చూస్తోంది. కాంగ్రెస్ మాత్రమే బీజేపీ కి ప్రత్యామ్నాయం అని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకపోతే బీజేపీ వస్తుందని.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ నేతలు… అవాకులూ, చెవాకులూ పేలుతున్నారని, పిచ్చిపట్టిన వారిలా మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాలంటే, విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ 17 పార్లమెంట్ స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

     రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రాక తోనే హస్తం నేతలు..ఇతర పార్టీల కన్నా ముందే మేల్కొని పార్లమెంట్ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూలతలను, అవకాశాలనూ పూర్తిగా వినియోగించుకోవాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే వరకూ పీ ఈ సీ ఒకటి , రెండు సార్లు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ఏ సమీకరణాల ఆధారంగా అధిష్టానం డిసైడ్ చేస్తుందో చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్