పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. అయితే, ఆ వెంటనే సైఫర్ కేసులో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతేడాది సెప్టెంబర్‌లో ఇమ్రాన్ ఖాన్, ఖురే షీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా వారికి పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.


