Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

పదేళ్ళ ఎన్డీఏ పాలనలో విదేశాంగ విధానాలు

     ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ భారత్ ఎన్నో దేశాలకు ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆప న్న హస్తాలను అందిస్తూ…భారత్ స్నేహ హస్తాన్ని చాపింది. ఈ నేపథ్యంలో అగ్రదేశాలతోపాటు అభివృద్ధి చెందు తున్న దేశాలు కూడా భారత్ జతకట్టడానికి సిద్ధం అయ్యాయి. ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం విదేశాంగ విధానాలు దేశ ప్రగతికి, శాంతి భద్రతలకు దోహదపడ్డాయి. జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో విదేశాంగ విధానాలు సరికొత్త మార్గా న్ని చూపాయి. వాస్తవానికి ప్రపంచ దేశాల దృష్టి ప్రస్తుతం భారత్ వైపే ఉందంటే అతిశయోక్తి కాదు . పదేళ్లలో ఎన్టీఏ ప్రభుత్వం అనుసరించిన విదేశాంగ విధానాలపై ఒక లుక్ వేద్దాం.

       పదేళ్ల ఎన్టీఏ ప్రభుత్వం హయాంలో మనదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో మోదీ వ్యూహాత్మక నిర్ణయాలు దేశ జీడీపీని పెంచాయని అంతర్జాతీయ సర్వేలు కూడా స్పష్టం చేశాయి. ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక , దౌత్య విదేశాంగ విధానాలకు మోదీ పెద్ద పీట వేశారు. భారత దేశ మూ శక్తివంతమైన దేశమేనని అగ్రదేశాలు గుర్తించే స్థాయికి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లారు. ప్రపంచంలో శత్రువుల కంటే మిత్రులను పెంచుకోవడంలో మోదీ చాణక్య నీతిని ప్రదర్శించారని సర్వత్రా వినిపిస్తున్న మాట. భారత దేశానికి అత్యధికంగా సైనిక పరికరాలను సరఫరా చేసే దేశం రష్యా, ఆ తర్వాత స్థానంలో ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దేశాలు చేరాయి. ఇజ్రాయెల్, రష్యాలతో భారతదేశం అతిపెద్ద సైనిక వ్యూహాత్మక భాగస్వామిగా మారేందుకు సిద్ధంగా ఉందని కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. రెండు దేశాలు కూడా తీవ్రవాద వ్యతిరేక రంగంలో అంతరిక్ష సాంకేతికత రంగంలో విస్తృతంగా సహకరించుకుంటున్నాయి.

        భారతదేశం యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, జపాన్, సింగపూర్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఇటలీతో సహా అనేక ఇతర దేశాలతో కూడా బలమైన సైనిక సంబంధాలను కలిగి ఉంది. అదనంగా, భారతదేశం తజికిస్తాన్‌లో వైమానిక స్థావరాన్ని నిర్వహిస్తోంది, 2008లో ఖతార్‌తో రక్షణ ఒప్పందంపై సంతకం చేయడం ఒక మైలు రాయిగా నిలిచింది. 2015లో నౌకాదళ స్థావరాన్ని నిర్మించడానికి సీషెల్స్ నుండి అసంప్షన్ ఐలాండ్‌ను లీజుకు తీసుకుంది.మనదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మెక్సికోలతో సంబంధాలను ఏర్పరచుకుంది. ఈ దేశాలు తరచుగా పలు ఆర్థిక వేదికల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడంలో సహక రించుకుంటున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , రష్యన్ ఫెడరేషన్, ఇజ్రాయెల్‌, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్,భూటాన్, బంగ్లాదేశ్,యునైటెడ్ స్టేట్స్‌లు భారతదేశానికి అత్యంత సన్నిహిత దేశాలుగా మెలుగుతున్నాయి.కశ్మీర్ లో గత ఏడాది జరిగిన G20 సమ్మిట్ ఫలితాలలో ఒకటిగా ఐరోపాకు భారతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు బాటలు వేసింది.

         ఇండియన్ లుక్ ఈస్ట్ విధానంలో భాగంగా ఆగ్నేయాసియా దేశాలైన దక్షిణ కొరియా, జపాన్, తైవాన్‌లతో గొప్ప ఆర్థిక వ్యూహాత్మక భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో మోదీ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. భారతదేశం కూడా పర్షియన్ గల్ఫ్ దేశాలు ఆఫ్రికన్ యూనియన్‌లోని చాలా మంది సభ్యులతో స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను కలిగి ఉంది .భారతదేశం ఆఫ్రికన్ దేశంతో సమగ్ర ఆర్థిక సహకారం, భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా సంతకం చేసిన మొదటి వాణిజ్య ఒప్పందంగా చరిత్రలో నిలిచిపోయింది. అలాగే ఆస్ట్రేలియాతో టెలికాం, కస్టమ్స్ విధానాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు మరియు ఇతర రంగాలలో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

         2015లో, భారతదేశం 36 రాఫెల్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేయడానికి ఫ్రెంచ్ ఏవియేషన్ కంపెనీ డసాల్ట్‌తో ఒక మైలురాయి రక్షణ ఒప్పందాన్ని ప్రకటించింది. మొదటి రాఫెల్ జెట్ 2019లో భారత్‌కు వచ్చింది. డిఫెన్స్ స్పేస్ ఒప్పందంలో భాగంగా 2024లో, భారతదేశం, ఫ్రాన్స్ సైనిక ఉపగ్రహాలను ప్రమాదకర, రక్షణాత్మక సామర్థ్యాలతో అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మకమైన రక్షణ అంతరిక్ష ఒప్పందంపై సంతకం చేశాయి.హెలికాప్టర్లను సహ ఉత్పత్తి చేసేందుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మోడీ దేశాన్ని నగదు రహితంగా మార్చడానికి చేసిన కృషి వ్యూహాత్మక, ప్రభావవంతమైన చర్యలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దేశాల మధ్య సరిహద్దు లావాదేవీల కోసం UPIని స్వీకరించడాన్ని ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోంది. వినియోగదారుల రక్షించే నేపథ్యంలో UPIసామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించడం మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.మొత్తంగా విదేశాంగ విధానాలు ఎంత సామరస్య పూర్వకంగా ఉంటే అభివృద్ధి అంత సాధ్యమవుతుందనే సంకేతాలను ప్రపంచానికి చాటడంలో మోదీ ప్రభుత్వం ప్రధాన భూమిక పోషించింది.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్