29.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

పదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీ విజయాలు

       నరేంద్ర మోదీ భారత్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు దేశ రాజకీయాలుఒక్కసారిగా కీలక మలుపు తీసుకున్నాయి. అప్పటి నుండి బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ కొత్త శకానికి నాంది పలికింది. వాస్తవానికి దేశ రాజకీయాల్లో నాటి నుండి మోదీ యుగం ప్రారంభమైందనే చెప్పాలి. ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన పదేళ్ల లో బీజేపీ జాతీయ, అంతర్జాతీయ విధివిధానాలు నెరపడంలో ప్రత్యేక ధోరణి ప్రకటించింది. పదేళ్ల పాలనలో విదేశీ విధానాలు దేశ విదేశాల్లో మోదీ ప్రభను మరింత పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. ఇంట గెలిచి రచ్చగెలవాలనే సూత్రాన్ని అక్షరాల పాటించడంలో మోదీ విజయాలు ప్రపంచానికి పాఠాలుగా మారాయి. ఏ దేశమైనా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లాలంటే ఆర్ధిక, విదేశాంగ విధానాల ప్రభావం ప్రధాన్యం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మోదీ విదేశాంగ విధానాల్లో భాగంగా వాణిజ్యం,ఆర్థిక దౌత్యాలను నెరపడంలో చాకచక్యంగా వ్యవహరించారు.కశ్మీర్ లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాలకు 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ ఆహ్వానిత అతిథి దేశాల నుండి ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు మన దేశానికి హాజరవ్వడంలో మోదీ కీలక పాత్ర పోషించారు.

        మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు అనేక పర్యాయాలు పర్యటనలు చేసారు. ఆ దేశాల అధినేతలతో వ్యక్తిగత సంబంధాలను పెంచుకున్నారు. మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ మార్క్‌ను దేశం మొత్తానికి విస్తరించే దిశగా సక్సెస్ అయ్యారు. దేశంలో ఆర్థిక పునరుద్ధరణ , భౌగోళికంగా రాజకీయ ఎదుగుదలకు అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, జపాన్ ,ఫ్రాన్స్ వంటి అనేక దేశాలతో దౌత్య సంబంధాలను పెంచుకోవడంలో వాణిజ్య మార్గాలను అన్వేషించడంలో మోదీ విధానాలు విజయాలకు కొలమానంగా నిలిచాయి. ప్రజల్లో జాతీయతా భావాన్నిపెంచడంలో మోదీ కీలకంగా వ్యవహరించారు. భౌగోళిక రాజకీయ శత్రుత్వం ఉన్నప్పటికీ, చైనా పట్ల భారతదేశం విదేశాంగ విధానాల్లో ప్రధాన వాణిజ్యం కేంద్రంగా మారింది. ఒకవైపు చైనా ప్రధాన శత్రువుగా చూస్తున్న అమెరికాతో సైతం మోదీ దౌత్య సంబంధాలను కొనసాగించడంలో ధీటుగా వ్యవహరించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో కూడా స్థిరమైన అభిప్రాయాలను ప్రపంచానికి చెప్పడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు.

         గడిచిన మూడేళ్లలో కోవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అగ్రదేశమైన అమెరికా కూడా 50 ఏళ్ల చరిత్రలో లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. యూఎస్ వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ఆయిల్ , ఇతర నిత్యావసర ధరల ద్రవ్యోల్బణం ఏర్పండింది. ఒకవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు ఆకలితో అలమటించాయి. ఈ క్రమంలో మోదీ చారిత్రాత్మక నిర్ణయాలే దేశ జీడీపీని పెంచాయని ఆర్థి వేత్తలు చెబుతున్నారు. జీడీపీ వృద్ధి రేటు 2023 -24 ఆర్థిక సంవత్సరానికి గానూ 6.5 శాతం నుండి 7శాతంపెరిగినట్టు అంతర్జాతీయ సర్వేలు సైతం వెల్లడించాయి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది జీఎస్టీ. అప్పటి వరకు రాష్ట్రాల్లో అనేక విధాలుగా ఉన్న పన్నుల స్థానంలో ఏకీకృత పన్నును మోదీ హయాంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. దేశ స్వాతంత్ర్యానంతరం జరిగిన భారీ పన్ను సంస్కరణలో భాగంగా జీఎస్టీ కీలకంగా నిలిచింది. వాస్తవానికి యూపీఏ హయాంలోనే జీఎస్టీని ప్రవేశ పెట్టాలనుకున్నారు.అప్పటి అధికార విపక్షాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా పెండింగ్ లో పడింది. అది కాస్తా 2017 జూలై 1 న మోదీ పాలనలో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కశ్మీర్ వివాదం పరిష్కారానికి అడ్డుగా ఉన్న 370 ఆర్టికల్ రద్దు విషయంలో మరో చారిత్ర ఘట్టానికి తెరతీయడంలో మోదీ ప్రభుత్వం ధైర్యంగా వ్యవహరించింది.

       శతాబ్దాలుగా భారతీయులు ఎదురు చూస్తున్న కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. మోదీ 2014, 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టలో రామమందిర నిర్మాణాన్ని ప్రజలకు హామీ ఇచ్చారు. రామమందిరం అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ మందిరం నిర్మాణానికి మోదీ హయాంలోనే అనుకూలంగా తీర్పు వచ్చింది.మోదీ చేతుల మీదుగా రామమందిర శంకుస్థాపనతోపాటు బాలరాముడి ప్రతిష్ఠమహోత్సవం వైభవోపేతంగా జరిగింది. దీంతో మోదీ ప్రభ దేశ విదేశాల్లో మరింత పెరిగింది. దేశ రాజకీయాలను దిశా నిర్దేశం చేయడంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానిదే కీలక పాత్రని అందరికీ తెలిసిందే. 2017లో యూపీలోని 403 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 312 స్థానాల్లో గెలిచి రికార్డ్ సృష్టించింది. ఈ గెలుపు మోదీ ప్రభావమేనంటారు రాజకీయ విశ్లేషకులు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 303 సీట్లు బీజేపీ సాధించింది. 2014లో సాధించిన 282 సీట్ల కంటే ఎక్కువగా మోదీ సంపాదించుకోవడం గమనార్హం. మోదీ సాధించిన అతిపెద్ద విజయంగా 2019 లోక్‌సభ ఎన్నికలను చెప్పుకోవచ్చు.2022లో జరిగిన ఎన్నికల్లోనూ 255 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరుసగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొంది పదేళ్లపాలనలో జాతీయ అంశాలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుంది. మోదీ విదేశాంగ విధానాలు.. ప్రపంచ శాంతి…ఆర్థిక, వాణిజ్య దౌత్య ఒప్పందాలు..విదేశీ పర్యటనలతో భారత్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగింది. పేరే కాకుండా మోదీ ప్రభ కూడా పెరిగింది. 2016 జూన్ లో యూఎస్ కాంగ్రెస్ లోనూ మోదీ ప్రసంగించారు. అనేక అంతర్జాతీయ వేదికలపై భారత సొంతగొంతును బలంగా వినిపించారు. అనేక దేశాలతో స్నేహబంధాన్ని పెంచుకున్నారు. భారత్ నుంచి మోదీ మొత్తం విదేశాలకు 68 సార్లు పర్యటించారు.

          అగ్రశ్రేణి విద్యా సంస్థల సంఖ్యను పెంచడంలో మోదీ ప్రధాన భూమిక పోషించారు. ఐఐటీలు, ఐఐఎంలు ,ఎఐఐ ఎంఎస్ వంటి జాతీయ సంస్థల సంఖ్య మోదీ హయాంలో పెరిగింది. గత ఏడాది 63వ స్థానంలో ఉన్న ‘ది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్’లో 71 భారతీయ విశ్వవిద్యాలయాలు రికార్డు సృష్టించాయి. మూడు భారతీయ విశ్వవిద్యాల యాలు ‘QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో’ టాప్-200 స్థానాలను సాధించాయి. 2018లో మణిపూర్‌లో జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం స్థాపన కూడా జరిగింది.కేంద్ర బడ్జెట్ 2022-23లో ప్రభుత్వం మద్దతుతో, భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌ల ఏర్పాటును ప్రోత్సహించడానికి UGC ముసాయిదాను విడుదల చేసింది. డీకిన్ విశ్వవిద్యాలయం GIFT సిటీలో భారతదేశంలో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయంగా మారింది. పదేళ్లలో మోదీకి వచ్చిన అంతర్జాతీయ అవార్డులు ఆయన ప్రభను మరింత పెంచాయి. ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ తో సత్కరించింది. అలాగే పాపువా న్యూ గినియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ మోదీకి ప్రదానం చేసింది. అలాగే, 2021లో ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ ను మోదీకి ప్రధానం చేసింది భూటాన్. 2016 నుంచి 2023 మే మధ్య మోదీ మొత్తం 11 దేశాల పురస్కారాలు అందుకున్నారు. అందులో అమెరికా “లెజియన్ ఆఫ్ మెరిట్” పురస్కారం, రష్యా ప్రదానం చేసిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ కూడా ఉన్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్