తెలంగాణ ప్రభుత్వం పదవుల పందేరాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ముగ్గురు సలహాదారులను నియ మించింది. ఇక, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవికి బాధ్యతలు అప్పగించింది రేవంత్ సర్కారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనుంది.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవ చేస్తున్నవాళ్లు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని వాళ్లు, పార్టీ కోసం త్వాగం చేసిన వాళ్లు.. వీరితోపాటు వివిధ సమీకరణాలతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లు.. ఇలా అనేక ప్లస్‌లు, మైన స్‌లు బేరీజు వేసుకుంది. ఈ క్రమంలోనే కొందరికి తాజాగా అవకాశం ఇచ్చింది. పదవుల భర్తీలో భాగంగా ముగ్గురు సల హాదారులను నియమించింది రేవంత్ ప్రభుత్వం. సీఎం సలహాదారుగా.. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన మా జీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని నియమించారు. ఇక, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత హర్కర వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీరితోపాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నియామకాన్ని చేపట్టింది తెలంగాణ సర్కారు. పార్టీ సీనియర్ నేత మల్లు రవికి ఈ బాధ్యతలు అప్పగించింది. నలుగురికీ కేబినెట్ హోదా ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. ఇక, ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వాళ్లలో షబ్బీర్ అలీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించను న్నారు. మరోవైపు… పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. సలహాదారుల రూపంలో నలుగురు కీలక నేతలకు అవకాశం కల్పించిన రేవంత్ ప్రభుత్వం.. త్వరలోనే మరిన్ని కీలక పదవులను ఆయా నేతలతో భర్తీ చేయనుంది.