కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకుంటుంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ 6000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణం రెండు నెలల పాటు సాగుతుంది. రాహుల్ గాంధీ 60 నుంచి 70 మందితో కాలినడకన, బస్సులో ప్రయాణించనున్నారు. కాసేపట్లో మణిపూర్‌లోని ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.
భారత్ జోడో న్యాయ్ యాత్ర 67 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కాలంలో మొత్తం 6,713 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ ప్రయాణం మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. ఈ కాలంలో ఇది 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రాహుల్ పాదయాత్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. వారిద్దరూ ఇప్పటికే మణిపూర్ చేరుకున్నారు. ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మణిపూర్ వచ్చారు.
.