25 C
Hyderabad
Saturday, March 7, 2026
spot_img

నేడు ధరణి పోర్టల్‌పై మధ్యంతర నివేదిక

      ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణ కమిటీ ఇవాళ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టల్‌ నిర్వహణ కంపెనీలతో ప్రాథమికంగా జరిపిన చర్చల అనం తరం రూపొందించిన ప్రాథమిక స్థాయి నివేదికను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమర్పించే అవకాశమున్నట్లు సమాచారం. సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, TSIICతో కమిటీ భేటీ ముగిసిన తర్వాత మంత్రికి నివేదికను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి జిల్లాలకు వెళ్లి క్ష్రేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను తెలుసుకున్న తర్వాత మధ్యంతర నివేదిక ఇవ్వాలని సభ్యులు భావిం చారు. కానీ ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఇవాళే సమర్పించాలని నిర్ణయిం చుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికపై కూడా చర్చించే అవకాశముంది. ధరణిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నేపథ్యంలో కమిటీ సమర్పించే నివేదికపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్