19.7 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

నెల్లాళ్ల పాలనలో హస్తం పార్టీ బెస్టా, వరెస్టా…?

ఆగదు ఏ నిమిషం…ఆగితే సాగదు లోకం….అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, వెళ్లాయి. బీఆర్ఎస్ రెస్ట్ లోకి వెళ్లింది. అప్పుడు రెస్ట్ లో వున్న కాంగ్రెస్ ఇప్పుడు గద్దె ఎక్కి కూర్చుంది. నెల్లాళ్ల పాలన సాగించింది. మరి ఈ నెల్లాళ్ల హస్తం పార్టీ పాలన ఎలావుంది..? బెస్టా, వరెస్టా…? ఈ విషయాలన్నీ ఓసారి సింహావలోకనం చేసుకుంటే….గత ఏడాది డిసెంబర్ 7 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు అవుతోంది. మార్పునకు నాంది పాలకాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు.

         ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమది ప్రజా ప్రభుత్వమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, అందుకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ ముందు పెట్టిన కంచెలను తొలగించి, ప్రగతి భవన్ పేరును జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్ గా మార్చారు. ప్రజలెప్పుడైనా ప్రజా భవన్ కి రావచ్చని సీఏం రేవంత్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా నాంపల్లికి చెందిన దివ్యంగురాలు రజీనికి ఉద్యోగం కల్పిస్తూ రెండవ సంతకం చేశారు.

        రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన 48 గంటల్లోనే ఆరు గ్యారెంటీ ల్లోని రెండింటిని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించి, నిరాటంకంగా అమలు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ లో 5 లక్షల రూపాయలు ఉన్న బీమాని 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే రేవంత్ tspsc పై రివ్యూ చేశారు. TSPSC ప్రక్షాళన చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇక రాష్ట్ర బడ్జెట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నిధులు ఏ మేరకు ఉన్నాయి? ఆదాయం ఏమేరకు జనరేట్ అవుతోంది? దుబారా ఎక్కడ జరుగుతుందనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అన్ని శాఖల మంత్రులు అయా శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు.

        ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశాల్లో భాగంగా నూతన సర్కారు శ్వేతపత్రాలని విడుదల చేసింది. ఆర్ధిక, విద్యుత్ శాఖలకి సంబంధించిన పూర్తి విషయాలను డిప్యూటీ సీఎం మల్లు మల్లు బట్టి విక్రమార్క సభకి తెలిపారు. డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని, డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేకుందు చర్యలు చేపడ్తామని రేవంత్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. అందుకు అనుగుణంగా పాలన లో దూకుడు పెంచారు.

         నెల రోజుల్లో సీఎం రేవంత్ నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇందులో రాజకీయ పరమైన పర్యటనలు కొన్ని, అధికా రిక పర్యటనలు మరికొన్ని వున్నాయి. రేవంత్ సీఎం అయ్యాక మర్యాద పూర్వకంగా ప్రధాని మోదీని కలిసి విభజన హామీలని అమలు చెయ్యాలని కోరారు. అప్పులు తీసుకునేందుకు అనుమతులు కోరుతూనే గత ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగిస్తామని రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పట్టుబట్టి నిధులు తెప్పించుకుందామని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ని, ఇరిగేషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గృహనిర్మాణ శాఖ మంత్రి అరవింద్ సింగ్ పురి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ లను కలిసి కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రావల్సిన నిధులని తక్షణమే విడుదల చెయ్యలని సీఎం రేవంత్ కోరారు.

          ప్రక్షాళనా చర్యలు చేపట్టిన సర్కారు పదుల సంఖ్యలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసింది. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో వున్న పలువురు అధికారులపై రేవంత్ ప్రభుత్వం వేటు వేసింది. సీఎంఓ ని బలోపేతం చేసే దిశగా రేవంత్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటిలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు. రెవెన్యూ శాఖ మీద పట్టు ఉన్న శేషాద్రిని రేవంత్ తన సెక్రెటరీగా నియమించుకున్నారు. కంటోన్మెంట్ బోర్డ్ లో పనిచేసిన అజిత్ రెడ్డిని సైతం తన కార్యాలయంలో సెక్రెటరీగా నియమించుకున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ చంద్ర శేఖర్ ని సీఏం ఓఎస్డీగా నియమించుకున్నారు. వీరితో పాటు మొట్టదటి సారి ఒక ఐపీఎస్ శానవాజ్ కాసిమ్ ని తన సెక్రటరీ గా నియమించుకున్నారు.

           ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ కార్యక్రమానికి వేలాది హాజరై తమ సమస్యలు తెలియజేసుకుంటున్నారు. గత ప్రభుత్వం అవకతవకలు వెలికి తీసి ప్రజలకు చెప్పడంలో భాగంగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫీల్డ్ విజిట్ చేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. TSPSC ని పారదర్శకంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ అధికారులను సైతం రేవంత్ కలిశారు. జాబ్ క్యాలెండర్ ఉండేలా విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేసేలా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేం దుకు, పెట్టుబడులు పెట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రోరైలు రూటు మ్యాప్ ని రేవంత్ ప్రభుత్వం మార్చింది. ప్రజల అవసరాలు, ఖర్చు తగ్గించే ప్రయత్నంలోనే ఈ మార్పు చేశామని రేవంత్ తెలిపారు. ఇక ఫార్మాసిటీ విషయంలో గత ప్రభుత్వం వేల ఎకరాలని సమికరించించింది. దాని రైతులు వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో వీటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకటే చోట ఫార్మసీటీ ఏర్పాటు చెయ్యకుండా ఓటర్ రింగ్ రోడ్డు నుండి 40 నుండి 50 కిలోమీటర్లు లోపు వివిధ క్లస్టర్లలో ఫార్మసిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

          భేషజాలకు పోకుండా ఆరోగ్య కరమైన రాజకీయాలే చేయాలని రేవంత్ భావిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్ లో ఉంటే స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇప్పటి వరకు అందరితో శభాష్ అనిపించు కుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి వర్గసభ్యులు…మరి భవిష్యత్ లో ఏ రీతిగా వుంటారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పాలనా వైఖరి ఎలావుంటుంది అనే విషయాలపై ప్రజలు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్