24.5 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

నిజామాబాద్ కమల నాథుల్లో వర్గపోరు

     నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ బలం బాగా పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం గతంలో కంటే భారీగానే పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన సదరు పార్టీకి ఈసారి కూడా విజయం పక్కా అంటున్నారు స్థానిక నేతలు. పార్టీ పరంగా…అటు ప్రజల్లో ఆదరణ ఉన్నా…నేతల మధ్య వర్గ పోరు ఎటు దారితీస్తుందో అన్న ఆందోళనలో ఉంది అక్కడి క్యాడర్. ఇక వివరాల్లోకి వెళితే …

    రోజు రోజుకి నిజామాబాద్ జిల్లాలో కమలం పార్టీ క్రేజ్ పెరుగుతొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 8 శాతం ఓటింగ్ వస్తే…. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 32 శాతం ఓటింగ్ బీజేపీకి వచ్చింది. ఈ లెక్కన జిల్లాలో బీజేపీ మంచి స్థానంలో ఉంది. ప్రజాధారణ ఆ పార్టీకి పెరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మిగతా చోట్లలో బీజేపీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వచ్చాయి. దాదాపు పార్లమెంట్ సెగ్మెంట్లో 3.65 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. అంటే ఎంపీ స్థానంలో కాషాయం పార్టీ మరో సారి విజయం సొంతం చేసుకుంటుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.

      నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ బడా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మొదటికే మోసం తెచ్చేలా ఉందంటున్నారు. ఈసారి పక్కాగా మళ్ళీ సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయమని సర్వేలు చెబుతుండటం వల్ల ఆ పార్టీలో ఎంపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు నేతల మధ్య ఆధి పత్య పోరు ఢిల్లీ పెద్దలకు తల నొప్పిగా మారింది. జిల్లా బీజేపీలో ప్రధానంగా రెండు వర్గాలున్నాయని చెప్పుకుంటారు. ఒకటి ఎంపీ అరవింద్ వర్గం కాగా మరోటి ఎండల నారాయణ వర్గం. అరవింద్ పార్టీలో చేరిన నాటి నుంచి ఒకే సామా జిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలకు అస్సలు పొసగదంటారు. అరవింద్ పార్టీలోకి వచ్చి రాగానే ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి జిల్లా పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తూ వచ్చారు. సీనియర్లను సైతం లెక్కచేయకుండా పార్టీ పదవుల్లో తన అనుచరులకే పెద్ద పీఠ వేసారు. గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో అరవింద్ మనుషులకే టికెట్లు ఇవ్వటం. ఇలాంటి పరిణామాలు ఎండల లక్ష్మీ నారాయణకు ఇబ్బoదిగా మారింది. తన అనుచరులకు సమాధానం చెప్పుకోలేకపోయారు. ఎండల అనుచరులను అరవింద్ ఎప్పుడూ పట్టించు కునేవారు కాదు అన్న ప్రచారం ఉంది. మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎండల నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించారు. అయితే అరవింద్ అడ్డుపడ్డారని ఎండల వర్గం వాదన. అటు రూరల్ నుంచి కూడా ఎండలకు టికెట్ రాకుండా అరవింద్ అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య వార్ పార్టీకి కొంత నష్టంకలిగించ వచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

      మరోవైపు ఇటీవలే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగింది. బస్వా లక్ష్మీ నర్సయ్యను జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి అరవింద్ అనుచరుడైన కులచారి దినేష్ కు ఇచ్చారు. దీంతో బస్వా కూడా అరవింద్ పై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అరవింద్ పార్టీలో చేరినప్పటి నుంచి ఎంపీగా గెలిచే వరకు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్ని తానై చూసుకున్నారు. కానీ వీరి మధ్య గ్యాప్ రావటానికి కారణాలు ఏమైనా … బస్వా వర్గం కూడా అరవింద్ పై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడు గా ఉన్న సమయంలో బస్వా నిజామాబాద్ టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. దీంతో బస్వా నిరాశ చెందారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా బస్వాను తప్పించటం బస్వా వర్గానికి మరింత కోపం తెప్పించిన ట్లైంది. అయితే వర్గ పోరుతోపాటు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. సీనియర్లు ఎండల లక్ష్మీ నారాయణ, అల్జాపూర్ శ్రీనివాస్, బస్వా లక్ష్మీ నారాయణతోపాటు మరికొందరు ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఈసారి మోడీ మేనియా ఉండటంతో అభ్యర్థులు ఎవరున్నా బీజేపీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయoటున్నారు. దీంతో పోటీ బాగా పెరిగింది. కానీ సీనియర్ నేతలు కూడా టికెట్ కోసం పోటీ పడటం, నేతల మధ్య చెలరేగుతున్న వర్గ పోరు ఎటువైపు దారితీస్తుందో అన్న ఆందోళనలో ఉంది నిజామాబాద్ జిల్లా కమలం పార్టీ క్యాడర్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్