22.2 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

దేశం సౌర విద్యుత్ వైపుకు మళ్లాల్సిందే ….!

   సూర్యోదయ్‌ యోజన, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన పథకం. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడమే సూర్యోదయ యోజన ప్రధాన లక్ష్యం. ఈ పథకం విజయవంతంగా అమలైతే, కోటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందుతుంది.అంతేకాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఆదా అవుతుంది.

        ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు సూర్యోదయ యోజన పథకాన్ని అమలు చేయడానికి అనేక ముందుకొచ్చాయి. అంతేకాదు సూర్యోదయ్‌ యోజన పథకాన్ని అమలు చేయడంలో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల అంశం కొంతకాలంగా తెరమీదకు వస్తోంది. స‌హ‌జంగా ఏ దేశ ప్ర‌గ‌తి అయినా విద్యుత్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌న దేశంలో ఉత్ప‌త్తి అయ్యే సంప్ర‌దాయ విద్యుత్ లో 53 శాతం వాటా బొగ్గు ఆధారిత విద్యుత్‌దే. అయితే విద్యుత్ త‌యారీకి ఎప్పుడూ బొగ్గు మీదే ఆధార‌ప‌డ‌టం మంచిదికాద‌ని నిపుణులు చాలా కాలం నుంచి హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. అయితే నిపుణుల హెచ్చరికలను ఇన్నాళ్లూ ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్‌కు పెద్ద పీట వేస్తూ తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సూర్యోదయ యోజన పథకాన్ని ప్రకటించారు. ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రుల‌న‌గానే అంద‌రికీ వెంట‌నే గుర్తుకువ‌చ్చే పేరు సౌర విద్యుత్. అంటే సూర్య కిర‌ణాల నుంచి విద్యుత్‌ను త‌యారు చేసుకోవ‌డం అన్నమాట. ఇళ్లు లేదా ప‌రిశ్ర‌మ‌ల పైక‌ప్పుల‌కు ప‌ల‌క‌లు ఏర్పాటు చేసుకుంటే సునాయాసంగా విద్యుత్ త‌యారు చేసుకోవ‌చ్చు.

     బొగ్గు ఆధారిత విద్యుత్‌తో పోలిస్తే, సౌర విద్యుత్ త‌యారీ చౌక అంటున్నారు నిపుణులు. ఈ కారణంతోనే 1980ల‌ నుంచి వ్యాపార కార్య‌క‌లాపాల కోసం సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రారంభమ య్యాయి. ఖ‌ర్చు త‌క్కువ కావ‌డంతో లక్షలకొద్దీ సోలార్ ప్యానెల్స్, విద్యుత్ గ్రిడ్‌లో భాగం అవ‌డం ప్రారంభమైంది. సౌర విద్యుత్ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే ఓ రికార్డు సాధించడం విశేషం. జోన్ పరిధిలోని నంద్యాల, యర్రగుంట్ల సెక్షన్‌ల మధ్య తొలి సోలార్ పవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ రూట్ పరిధిలోని ఎనిమిది స్టేషన్‌ లలో అంతరా యం లేని విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాగా సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా క‌ర్బ‌న ఉద్గారాలు తగ్గించడం సాధ్య‌ప‌డుతుంద‌ని రైల్వే ఉన్న‌తాధికారులు తెలిపారు. అలాగే కేర‌ళ‌లోని కొచ్చిన్ ఇంట‌ ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు ఒక రికార్డు క్రియేట్ చేసింది. ప్ర‌పంచంలోనే పూర్తిగా సోలార్ ప‌వ‌ర్ పై న‌డిచే విమానాశ్ర‌ యంగా కొచ్చిన్‌ పేరు న‌మోదు చేసుకుంది. విమానాశ్రయ విద్యుత్ అవ‌స‌రాల కోసం ప్ర‌త్యేకంగా ఒక హైడ్రో ఎల‌క్ట్రిక్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఏడాదికి 14 మిలియ‌న్ ట‌న్నుల విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఈ ప్లాంట్ కు ఉంటుంది.

       ఇదిలా ఉంటే బొగ్గుకు ప్రత్యామ్నాయంగా చెబుతున్న సోలార్ ప‌వ‌ర్ సెక్టార్ ను ప్రోత్స‌హించ‌డానికి ప్రభుత్వాలు చ‌ర్య‌ లు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ప్యానెల్స్ తో పాటు ఇత‌ర మెటీరియ‌ల్ కొనుగోలుకు స‌బ్సిడీలు ఇవ్వాలని కోరు తున్నారు. సోలార్ ప‌వ‌ర్ వాడ‌కాన్ని అన్ని రంగాల్లో ప్రోత్స‌హించ‌డానికి ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల పరిధిలోని భవనాల నిర్మాణంలో పైకప్పునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు తప్పనిసరి చేయా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడ మొధేరా గ్రామం గురించి చెప్పుకుని తీరాలి. మొధారా. గుజరాత్ రాష్ట్రం మెహసాని జిల్లాలోని ఓ చిన్న గ్రామం. ఈ గ్రామం సౌర విద్యుత్‌ తయారీలో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టి స్తోంది. మొధేరా గ్రామంలోఎటు చూసినా సోలార్ ప్యానెల్సే కనిపిస్తుంటాయి. గ్రామస్తులెవరూ, సంప్రదాయ విద్యుత్‌ మీద ఆధారపడరు. సౌర విద్యుత్‌కే జై కొడతారు. మొధేరా గ్రామం ప్రత్యేకత మరోటి ఉంది. ఊళ్లో కరెంటు పోవడం అనే మాటే వినపడదు. ఇరవై నాలుగు గంటలూ సౌర విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వం సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మొధేరా గ్రామానికి కొంత భూమిని కూడా అందచేసింది. 2022 నవంబరు నెలలో ప్రధాని నరేంద్ర మోడీ, మొధేరా గ్రామానికి వెళ్లారు. సోలార్ పవర్‌లో మొధేరా సాధించిన విజయాన్ని చూసి గ్రామస్తులను అభినందించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్