ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్ట నష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర చేశారు.దాని ఆధారంగా రూపొందించిందే ‘యాత్ర’ సినిమా. ఆ తొలి చిత్రానికి కొనసా గింపుగా రూపొందిన చిత్రమే ‘యాత్ర 2’. వైఎస్‌ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ఆయన కుమారుడు జగన్ పాత్రలో తమిళ నటుడుడ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితులు. జగన్ పేదల కోసం చేసిన పాదయాత్ర వంటి పలు అంశాల ఆధారంగా ‘యాత్ర 2’ సినిమా తీశారు. ఫిబ్రవరి 8న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. యాత్ర -2 ఘన విజయం సాధించడంతో చిత్రయూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు
మహి వీ రాఘవ్ మీడియాతో ముచ్చటించారు.
ఆయన తీసిన యాత్ర – 2 చిత్రం ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం నచ్చిందనే టాక్ నచ్చింది.అయితే కొంతమంది ప్రేక్షకులు సినిమాను విమర్శిస్తున్నారు. వాస్తవానికి పొలిటికట్ మూవీ కాబట్టి సహజంగానే విమర్శలు వస్తాయని మూవీ దర్శకుడు అన్నారు. కానీ ఒక దర్శకుడిగా… స్టోరీ టెల్లర్‌గా…తాను అనుకున్న కథను, స్క్రిప్ట్‌ను సినిమాగా తీశానని చెప్పారు. థియేటర్ లో చాలా మందికి తన సినిమా బాగా నచ్చిందని అభిప్రాయపడ్డారు. సినిమా చూసిన పాత్రికేయుల్లో కొంతమంది పాజిటివ్ రివ్యూలు ఇస్తే…మరికొందరు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఫిల్మ్ మేకర్లుగా సినిమాను తీయడం మాత్రమే తమ బాధ్యత అని దర్శకుడు చెప్పారు. విమర్శలను డిఫెండ్ చేసుకోనని అన్నారు. సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా తన టెక్నికల్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. మమ్ముట్టి, జీవాలకు పత్రికాముఖంగా కృతజ్ఞతలను తెలియజేశారు.ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని నుంచి బయటకు వచ్చేస్తానన్నారు.
యాత్ర 2 చిత్రం తీయాలని 2019లోనే నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తండ్రీ కొడుకుల కథ చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నానన్నారు.ఆ కథకు తగ్గట్టుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నా నన్నారు. వారిద్దరు తప్ప మీకు ఆ పాత్రలు చేయడానికి ఎవరూ దొరకలేదా అని అంతా అడిగారు. కానీ తన కథకు తగ్గట్టుగానే తాను పాత్రలు ఎంచుకున్నానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా సినిమాను చూడలేదు. త్వరలోనే ఆయన చూస్తారు. నంద్యాల బై ఎలక్షన్ సీన్ ఎడిటింగ్‌లో పోయింది. ఈ సినిమా విడుదలై ఒక్క రోజే అయింది. కాబట్టి సినిమా విడుదల రోజే మేం థియేటర్లకు వెళ్తే రియాల్టీ తెలియదు. వచ్చేవారం నుంచి రియల్ టాక్ తెలుస్తుంది అన్నారు చిత్ర దర్శకుడు. థియేటర్లో మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. త్వరలోనే ‘సేవ్ ది టైగర్స్ 2’ రాబో తోంది ఈ సందర్భంగా ప్రేక్షకులకు తెలిపారు. తను ఒక కథ రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటానని చెప్పారు.