టీటీడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులందరికీ శ్రీ క్రోధినామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలిసారిగా తెలుగు క్యాలెండర్‌ను ప్రచురించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీటిని అమ్మకానికి అందుబాటులో తెస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వచ్చే వారం నుంచి భక్తులకు క్యాలెండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్‌లో నెలవారీ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో భక్తుల సౌకర్యా ర్థం ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్స వాలు, వివిధ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడిం చారు.