27.7 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

తమిళ నాట రెపరెపలాడనున్న సినీ నటుడి కొత్త పార్టీ జెండా

        తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది. తమిళిగ వెట్రి కళగం పేరుతో ప్రముఖ తమిళ సినీ నటుడు విజయ్ దళపతి రాజకీయ పార్టీ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విజయ్ అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. తమిళనాడులోని అనేక ప్రాంతీయ పార్టీల వ్యవస్థాపకులు సినీ రంగానికి చెందిన ప్రముఖులే. ఈ నేపథ్యంలోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న సినీ హీరో విజయ్, రాజకీయ పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు.

      తమిళనాడులో కొనసాగుతున్న అవినీతి పాలనపై పోరాటం చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు విజయ్ దళపతి పేర్కొన్నారు. అయితే మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతు కూడా ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారి తమిళిగ వెట్రి కళగం పోటీ చేస్తుందని తెగేసి చెప్పారు. అయితే పార్టీ జెండా, అజెండాపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు హీరో విజయ్. తమిళనాడులో విజయ దళపతికి మంచి స్టార్‌డమ్‌ ఉంది. ఇప్పటితరం హీరోలలో ప్రముఖుడిగా విజయ్‌ను చెబుతారు తమిళ సినీ ప్రముఖులు. హీరో విజయ్‌ను అభిమానులు ప్రేమగా దళపతి అని పిలుస్తుంటారు. విజయ్‌ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు. కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన ఉన్నారు. పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.

        హీరో విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమాన సంఘం నిర్వాహకులతో విజయ్ ఇటీవల సుదీర్ఘ మంతనాలు జరిపారు. రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అనే విషయ మై పలు దఫాలు చర్చలు జరిపారు. దీంతో తమిళిగ మున్నేట్ర కళగం పేరుతో విజయ్ పార్టీ పెడతారన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో కొంతకాలంపాటు హల్‌చల్‌ చేశాయి. అయితే పార్టీ పేరు మారింది. పార్టీ పేరులో స్వల్ప మార్పులు చేశారు. చివరకు తమిళిగ వెట్రి కళగం పేరును హీరో విజయ్ ఖరారు చేశారు. విజయ్ దళపతికి ఈ రేంజ్‌లో స్టార్‌డమ్ రావడంలో తెలుగు చిత్రాలు కీలకపాత్ర పోషించాయి. పోక్కిరి, గిల్లి, బద్రి, వేలాయుధం, యూత్ వంటి సినిమాలతో విజయ్‌కు స్టార్‌డమ్ వచ్చింది.అయితే తమిళనాట సూపర్‌డూపర్ హిట్ అయిన ఈ సినిమాలన్నీ తెలుగు రీమేక్‌లు కావడం విశేషం. తన విజయంలో అభిమానుల పాత్ర ఎంతో ఉందంటారు హీరో విజయ్‌. అభిమానులకు విజయ్‌ ప్రాధాన్యం ఇస్తారు. ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా అభిమానులను సంప్రదిస్తుంటారు. ఏడాదికి రెండు సార్లు అభి మానులతో హీరో విజయ్ సమావేశమవుతుంటారు. వారికి పసందైన విందు ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాదు అభిమా నులకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తుంటారు. ఫ్యాన్స్ పట్ల తన ఆత్మీయతను చాటుకుంటారు స్టార్ హీరోవిజయ్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్