తమిళనాడు విలక్షణ రాజకీయాలకు పురిటి గడ్డ. ఇటు నేతలు అటు ప్రజలు భావ చైతన్యంతోపాటు రాజకీయ చైతన్యం కూడా కలిగుంటారు. సిద్ధాంత ప్రాతిపదికల మీద వచ్చిన పార్టీలు తమిళనాడు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయ చిత్రంపై మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ సీనీ హీరో విజయ్ తమళినాట ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపన జరిగింది. ఈ సందర్భంగా సినీ నటుడు విజయ్ మాట్లాడుతూ.. ఈ ఏడాడి జరిగే లోక్ సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేయదని స్పష్టం చేశారు. అలాగే ఏ పార్టీకి మద్దతు ప్రకటించదని స్పష్టం చేశారు. 2026లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీవీకే పార్టీ అధినేత తెలిపారు. ఇటీవల తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా అవినీతి పాలన సాగుతోం దని విమర్శించారు. ప్రజాక్షేమం దృష్ట్యా అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని పార్టీ ఆవిర్భావ సభలో పేర్కొ న్నారు. త్వరలోనే పార్టీ జెండా కూడా ఆవిష్కరిస్తామని తెలిపారు. తమిళ సినీ రంగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్. ఆయన తమిళంలో ఇప్పటి వరకు 68 సినిమాల్లో మాత్రమే నటించారు. అయితే ఈ మధ్య కాలంలో సినీ నటుడు విజయ్ రాజకీయ పార్టీని పెడతాడనే చర్చ దశాబ్ద కాలంగా ప్రచారంలో ఉంది. సినీ నటుడు విజయ్ తన ఛారిటీ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.