పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బాలకృష్ణ కిరాణా జనరల్ స్టోర్‌లో చోరీ చేసేందుకు దొంగలు ప్రయ త్నించారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు స్టోర్ షట్టర్ తెరవడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. అయితే.. షాపు తాలాలు ఎంతకీ తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగినట్టు సీసీ టీవీవిలో నమోదు అయింది. మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు షాపు ముందు తిరుగుతూ చోరీకి యత్నిం చారు. దీనిపై తణుకు పట్టణ పోలీసులకు షాపు యజమాని బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసు లు షాపు పరిసర ప్రాంతాలను పరిసిలించి వివరాలు సేకరించారు.