గద్వాల జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమని అన్నారు. ఘటనా స్థలిని గద్వాల డిఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్ సరిత పరిశీలిం చారు. బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. వోల్వో బస్సు డ్రైవర్లు షంషోద్దీన్, ఏసేబూపై కేసు నమోదు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీ వదహ నమైంది. నలుగురు గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా, ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.