2024 అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ మధ్య నేరుగా హోరాహోరీ పోటీ జరుగుతుంది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రేస్ నుంచి తప్పుకున్నారు. వివేక్ రామస్వామి అంతకుముందే రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన పరిణామాల్లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ జిఒపి అధ్యక్ష ప్రైమరీ రేసు నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీ అభ్యర్థిగా మాజీ యుఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా రేసులో మిగిలి ఉన్న ఏకైక రిపబ్లికన్ నిక్కీ హేలీ అయ్యారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ లో పరిణామాలు చూస్తుంటే, 2024 నవంబర్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జిఓపి అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు 2020 ఎన్నికలకు పునరావృతం కాగలవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.