23.6 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

డిప్యూటీ స్పీకర్ లేకుండానే ముగుస్తున్న లోక్ సభ సమావేశాలు

      మరో వారం రోజుల్లో 17వ లోక్ సభ సమావేశాలు ముగిసిపోతాయి. 17వ లోక్ సభలో మొత్తం ఐదేళ్లలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సమావేశాలు ముగిసిపోతున్నాయి. రాజ్యాంగ ప్రకారం స్పీకర్ తో పాటు, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవడం తప్పని సరి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి … డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం ఇష్టంలేకపోవడం వల్లనే ఈ సారి డిప్యూటీ స్పీకర్ నే ఎంపిక చేయలేదని ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల విమర్శ. ఇంతకూ డిప్యూటీ స్పీకర్ ఎంపిక పట్ల అధికార పక్షం ఎందుకు అలక్ష్యం వహించింది?

       కొత్తగా లోక్ సభకు ఎన్నికైన సభ్యులు తొలి సమావేశంలోనే స్పీకర్ ను, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకుంటారు. సాధార ణంగా అధికారపార్టీ సభ్యుడిని స్పీకర్ గా, ప్రతిపక్షంలో అతి పెద్ద పార్టీ సభ్యుడిని డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోవడం ఆనవాయితీ. అయితే 17 లోక్ సభలో మాత్రం బీజేపీ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోకుండానే కాలయాపన చేసింది. స్పీకర్ సభను నిర్వహించని సమయంలో డిప్యూటీ స్పీకర్ సభా కార్యకలాపాలకు ఆధ్వర్యం వహిస్తాడు. 17వ లోక్ సభలో స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ సభ్యులే స్పీకర్ స్థానం లో నిలిచి కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యాంగం 93, 178 అధికరణం ప్రకారం లోక్ సభ ప్రారంభ సమావేశాల్లోనే ఇద్దరు సభ్యులను స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోవాలి. ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని రాజ్యాంగం లో లేదు. కానీ, ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఓ ఆనవాయితీగా ఉంది. 17వ లోక్ సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్ కు అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, సాంప్రదాయాన్ని ఉల్లంఘించిందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.

     17వ లోక్ సభలో కాంగ్రెస్ 54 మంది సభ్యులతో ప్రతిపక్షంలో అతిపెద్ద సింగిల్ పార్టీగా నిలిచింది. సభలో ప్రతిపక్ష హోదా లభించాలంటే.. కనీసం 56 మంది సభ్యులుండాలి. అప్పుడే డిప్యూటీ స్పీకర్ ఎంపికకు అవకాశం.. కాంగ్రెస్ కు ఆ హోదాకు ఇద్దరు సభ్యులు తక్కువగా ఉన్నారు. అది పూర్తిగా సాంకేతిక పరమైన విషయం. ప్రభుత్వం కోరుకుంటే ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఉండవచ్చు. అధికారపార్టీ ఇవ్వదలచు కోలేదు అన్నది సుస్పష్టం అంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రతిపక్ష సభ్యుడికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే సంప్రదాయాన్ని 1956లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. అప్పట్లో శిరోమణి అకాలీదళ్ కుచెందిన సర్దార్ హుకుం సింగ్ ను డిప్యూటీ స్పీకర్ గా ఎన్నకున్నారు. తర్వాతి కాలంలో అధికార కాంగ్రెస్ సభ్యులే డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ వచ్చారు. తర్వాతి కాలంలో అధికారపార్టీ ప్రతిపక్షంలోని తన మిత్రపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి కట్టపెడుతూ వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో ఇండి పెండెంట్ సభ్యుడు జి.జి. స్వెల్ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక చేశారు. 16వ లోక్ సభలో అధికార బీజేపీ తమ మిత్రపక్షమైన ప్రతిపక్షపార్టీ ఏఐఏడిఎంకె కు చెందిన ఎం. తంబిదొరైని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసింది.

           రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్ కు కూడా స్పీకర్ కు ఉన్న అన్నిఅధికారాలు ఉంటాయి. స్పీకర్ లేని పక్షంలో సభా కార్యక్రమాలకు ఆధ్వర్యం వహించాలి. డిప్యూటీ స్పీకర్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు, ఆ కమిటీకి చైర్మన్ గా నియమించబడతారు. స్పీకర్ సభను నిర్వహిస్తున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ సభలో చర్చల్లో పాల్గొనవచ్చు. సభ్యుడిగా ఓటింగ్ లోనూ పాల్గొనవచ్చు. పార్లమెంటు నిబంధనల ప్రకారం స్పీకర్ పదిమంది సభ్యులను స్పీకర్ ప్యానెల్ సభ్యులుగా నియమిస్తారు. వారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. 17వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేకున్నా ప్యానెల్ సభ్యులను నియమించారు. వారు బీజేపీకి చెందిన రమాదేవి, కిరీట్ పి. సోలంకీ, రాజేంద్ర అగర్వాల్, కాంగ్రెస్ కు చెందిన కె. సురేశ్, డిఎంకె కు చెందిన ఏ. రాజా, వైఎస్ ఆర్ సీపీకి చెందిన పివి మిథున్ రెడ్డి, బీజేడీ కి చెందిన బి. మహతాబ్, ఆర్ ఎస్పీకి చందిన ఎన్.కె. ప్రేమచంద్రన్, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కాకోలి ఘోష్ దస్తిదార్. 17వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడమే కాదు. ఇంకా చాలా విశేషాలు జరిగాయి. పార్లమెంటు చరిత్రతో తొలిసారిగా ఉభయ సభలకు చెందిన 146 మంది సభ్యులను శీతాకాలం సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేశారు. కనీసం చర్చ లేకుండా పలు బిల్లులు ఓకే చేసేశారు రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుచేసి, పునరుద్ధరించడం, మరో టీఎంసీ సభ్యురాలు ఎథిక్ కమిటీ నివేదిక నేపథ్యంలో సభ్యత్వం రద్దుచేయడం వంటివి ఎన్నో.. ఏమైనా.. అధికార పార్టీ అనుకున్నట్లే.. పార్లమెంటు సాగిందన్నది నిజం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్