జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మెహిదీపట్నం కింగ్స్ ప్యాలెస్‌లో ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ సమక్షంలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.ఇందులో భాగంగా రోడ్డు సేఫ్టీపై ఫ్రీ రికార్డ్ ఆడియో సందేశాన్ని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, సినీ నటుడు జొన్నలగడ్డ సిద్దు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు విడుదల చేసారు. రోడ్డు భద్రత ప్రమాణాల్లో భాగంగా పాటించాల్సిన నియమాలు, రోడ్డు ప్రమాదాలపై జరిగిన అవగహన కార్యక్ర మానికి కారు, ట్రక్, ఆటో డ్రైవర్లు, స్థానికులు, యువకులు భారీగా హాజరయ్యారు.
డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రోడ్డు ప్రమాదాలను నివరించాలంటే రూల్స్ పాటించాల్సిందేన న్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్. ఆటో డ్రైవర్స్ జాగ్రత్తగా రోడ్డు మీద డ్రైవ్ చెయ్యాలని, రోడ్డు మీద నో పార్కింగ్ స్థలాల్లో వాహనాల పార్కింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రూల్స్ ఫాలో అవుతూ డిసిప్లేన్ గా వెళ్తే అందరికీ శ్రేయస్సు అని చెప్పారు. . హైదరాబాద్ లో జనాభా పెరగడంతో ట్రాఫిక్ మరింత పెరిగిందన్నారు. రోడ్డు మీద వాహనాలు నడపేటప్పుడు మనకు మనమే స్వయంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే రోడ్డుపై డిసిప్లైన్ గా వాహనాలు నడుపుతామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి. ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యాల్సిన బాధ్యత సిటీ పోలీసులపై ఉందని, ఒక్క వాహనదారుడు తప్పు చెయ్యడం వల్ల పక్కన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలని, హైదరాబాద్ చరిత్రాత్మక నగరం…ఎంతో గొప్ప పేరొందిందని, దీని పేరును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఉండాలంటే వాహన దారులు అందరూ సహకరించాలని, టాక్సీ, ఆటోవాల అందరు జాగ్రత్తగా వాహనాలు నడిపితేనే ట్రాఫిక్ కంట్రోల్ లో ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు ఫాలో కావాలి. అందరికీ ఎమర్జెన్సీ ఉంటుంది.. అందరూ తొందరగా వెళ్లాలనుకుంటే వీలు కాదు. ముందుగా బయలుదేరితేనే గమ్యం చేరుతామన్నారు. ట్రాఫిక్ కి సంబంధించిన నియమాలను సీపీ శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్ కి తెలియజేశారు. ఇలా ట్రాఫిక్ ని నియంత్రణ చెయ్యడానికి హైదరాబాద్ పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ల మొదలుకుని నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాటి తీరును, తీసుకోవలసిన జాగ్రత్తలు …ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై తీసుకునే చర్యలపై వాహనదారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగవని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు.