ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు రానుం దనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత కీలక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది ఏలూరు. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా మరోసారి ఆళ్ల నానీయే బరిలో దిగబోతున్నా రు. మరి.. ప్రతిపక్షాల నుంచి ఎవరు బరిలో ఉంటారు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఓవైపు టీడీపీ-జనసేన కూట మి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంతో పార్టీ కేండిడేట్లలోనే కాదు.. కేడర్‌లోనూ కొంత అయోమయం నెలకొందనే చెప్పాలి. అయితే… అభ్యర్థుల ప్రకటన కాస్త లేటైనా విజయం మాత్రం తమదేనని చెబుతున్నారు కూటమి అభ్యర్థులు. తెలుగుదేశం, జనసేన జెండాలు ఈసారి ఏలూరు గడ్డపై ఎగరడం ఖాయమని చెబుతున్నారు.
ఓవైపు వై నాట్ 175 అంటూ వైసీపీ…ఇంకోవైపు జగన్ సర్కారును ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామంటున్న టీడీపీ జన సేన కూటమి ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క సీటు, ప్రతి ఓటూ ఎంతో ప్రధానమైనది. అయితే.. ఇప్పటికే వైసీపీ.. ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పుల పేరుతో అభ్యర్థుల్ని ప్రకటించు కుంటూ ముందుకెళుతుంటే… టీడీపీ జనసేన కూటమి మాత్రం సీట్ల సర్థుబాటు విషయంలో ఆఖరి మెట్టుపై ఉంది. ఇప్పటికే బీజేపీతో సైతం పొత్తు ఉంటుందన్న ప్రచారం సాగుతున్న వేళ.. దీనిపై కూడా ఓ క్లారిటీ ఒకటి రెండు రోజుల్లో రానుంది. అది వచ్చిన వెంటనే ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించాలని భావిస్తున్నాయి టీడీపీ జనసేన.
ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాత్రం టికెట్ మాదంటే మాదంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు. ఇక్కడ్నుంచి బరిలో దిగేందుకు టీడీపీ, జనసేన నేతలు పోటీ పడుతున్నారు. పొత్తులో భాగంగా సీటు తమకే దక్కుతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటే.. లేదు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన రంగంలో ఉంటుందని చెబుతున్నారు జన సైనికులు. దీంతో.. ఇరు పార్టీల కేడర్‌లో కొంత అయోమయం పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను ఓసారి గమనిస్తే…తెలుగుదేశం పార్టీ ఏలూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటి. అయితే.. పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా… సీటు నాదే… గెలుపూ నాదే అంటూ ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. నిజానికి… ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉండేది. కానీ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత… ఈ నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్వపు వైభవాన్ని కొనసాగించలేకపోతోంది. రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్.. అలి యాస్ ఆళ్లనాని రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. కానీ, 2019 ఎన్నికల్లో అదే బుజ్జిపై గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుత ఏలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆళ్ల నానిపై విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేస్తున్నారు బడేటి రాధాకృష్ణ.
జనసేన తరఫున బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు రెడ్డి అప్పలనాయుడు. పొత్తులో భాగంగా ఈసారి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని కేడర్‌కు చెబుతూ పార్టీ తరఫున ప్రచారానికి రెడీ అవుతున్నారు అప్పలనాయుడు. ఎక్కడికక్కడ నియోజకవర్గంలో ఆత్మీయ సమవేశాలు నిర్వహిస్తూ తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు జనసేన నేత. ఇక, వైసీపీ తరఫున మరోసారి ఆళ్ల నాని బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలె జిల్లాలో సిద్ధం సభ పెట్టడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి తన గెలుపు గ్యారెంటీ అని టున్నారాయన. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ అసెంబ్లీ లోకి వస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆళ్ల నాని. నాని పోటీ వరకు బాగానే ఉన్నా… నియోజకవర్గంలో మాత్రం ప్రజా వ్యతిరేకత భారీగా ఉందనే వాదన బలంగా విన్పిస్తోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, చివరకు డిప్యూటీ సీఎంగా ఉన్నా ఏలూరు అసెంబ్లీ పరిధిలో మాత్రం పెద్ద అభివృద్ధి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాని మరోసారి పోటీ చేస్తుండడంతో పోరు రసవత్తరంగా మారిందనే చెప్పాలి.
గత రెండు దశాబ్దాల కాలంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కాపు సామాజికవర్గ నేతలకు కంచుకోటగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన బడేటి బుజ్జి కాని గత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్లనానీ కానీ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం గమనార్హం. ఇక్కడ కాపుల సంఖ్య ఎక్కువ ఉండడంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్ని డిసైడ్ చేసేది వీరేనని చెప్పాలి. దీంతో.. అన్ని పార్టీలూ సాధారణంగా కాపులకే ఈ సీటు కేటాయిస్తుంటాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ… ఓవైపు టీడీపీ అధినేత రా.. కదలిరా అంటూ సభలు పెడుతూ ప్రచారాన్నిహోరెత్తిస్తున్నారు. నారా లోకేష్ సైతం శంఖా రావం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం త్వరలోనే జనంలోకి వచ్చేందుకు సిద్ధమ వుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సీట్ల సర్థుబాటు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో స్థానికంగా ఉన్న తాము ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు టీడీపీ జనసేన నేతలు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటించినా ఉమ్మడిగా పోరాడి గెలిపించుకుంటామని చెబుతున్నారు. ఎట్టి పరిస్థి తుల్లోనూ రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మొత్తంగా ఎవరు పోటీ చేసినా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న పోరు మాత్రం హోరాహోరీగా సాగుతుందని చెప్పక తప్పదు.


