తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో గంజాయి మాఫియా దారుణాలు వెలుగు చూశాయి. గంజాయి మాఫియా సరికొత్త ప్లాన్ తో గంజాయి సరఫరాకు పాల్పడింది. పుష్ప మూవీ రేంజ్ లో గంజాయి తరలించడానికి పెద్ద స్కెచ్ వేసింది. పోలీ సుల నిఘాతో మాఫియా ప్లాన్ బ్రేక్ చేశారు. దీంతో 168 ప్యాకెట్లలో ఉన్న 330 కిలోల గంజాయిని ఒక డీసీఎంలో అక్రమం గా తరలిస్తుండగా సాగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ఆ పై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మాఫియా ముఠాలో నలుగురు టమాటా ట్రేల మధ్య గంజాయి దాచి, మహారాష్ట్రకు తరలి స్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గంజాయి మాఫియాను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.