జపాన్ భూకంపం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్. న్యూ ఇయర్ వేడుకల కోసం జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. జపాన్‌లో భూకంపం గురించి తెలిసి షాక్‌కు గుర య్యానని.. అక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.