35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

జననాయగన్‌ టైటిల్స్‌లో సీఎం విజయ్‌.. ఫ్యాన్స్‌ సంబరాలు

తమిళనాడులో ఎన్నికల సమయంలో వివాదాల కారణంగా విడుదలకు నోచుకోని ‘జననాయగన్‌’ చిత్రం తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమా హీరో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసి, టీవీకే పార్టీతో ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అభిమానుల్లో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది.

మొదటగా అనుకున్న తేదీకి సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందగా.. ఇప్పుడు చిత్ర బృందం వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. ‘జననాయగన్‌’ టైటిల్ కార్డులో ‘దళపతి విజయ్‌’ స్థానంలో ‘సీఎం విజయ్‌’ అని మార్చి కొత్త వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన సందర్భంగా చిత్రబృందం విజయ్‌ను అభినందిస్తూ ప్రత్యేక పోస్టు చేసింది. ఈ క్రమంలో అభిమానుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు టైటిల్ కార్డు మార్చినట్లు తెలుస్తోంది. కొత్తగా విడుదల చేసిన టీజర్‌లో ‘గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ నటించిన’ అంటూ టైటిల్ కార్డు ప్రదర్శించడం విశేషం.

పోలీసు వేషధారణలో నడుచుకుంటూ వచ్చే విజయ్‌ లుక్‌ను టీజర్‌లో చూపించారు. థియేటర్లలో కూడా ఈ టీజర్‌ను ప్రదర్శించడంతో అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. టైటిల్ కార్డు మార్పును చూసి అభిమానులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకుంటున్నారు.

హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. మొదట జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్