తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినాయకుడు పవన్ కల్యాణ్ లపై మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తన స్టైల్‌లో మరోసారి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబాబు బీసీల ను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇప్పడు బీసీల అభివృద్ధి గురించి చంద్రబాబబు మాట్లాడితే నమ్మిపరిస్థితి లేదని, అసలు ఆయనను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. జనసేన నేతను పవనన్‌ను వెనకాల తిప్పుకుంటుటున్న చంద్రబాబు బీసీలు తన వెన్నెముకంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదని మరో సారి తనదైన శైలిలో విమర్శించారు.
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ పెట్టిన పథకాలను అమలలు చేయడం తప్ప చంద్రబాబు బీసీల కోసం చేసిందేముందని కొడాలి నాని సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ బీసీలకు నాలుగు రాజ్యసభ పదవులకు స్థానం కల్పిం చారని చెప్పారు. ఆయన ఇన్నేళ్ల రాజకీయ ప్రస్తానంలో ఒక్కసారైనా బీసీనేతను రాజ్యసభకు పంపించారా? అని ఘాటు గా ప్రశ్నించారు. ఓసీ రిజర్వుడు పదవులు బీసీలకు ఇచ్చి, బీసీలకు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని జగన్ పాల నపై ప్రశంసలు వర్షం కురిపించారు. రాబెయే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కలలు చెదిరిపోతాయి అన్నారు.